Download App

ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య

జూన్ 28, 2025 By Srinivas
తెలుగు టెలివిజన్ రంగంలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. ఈ ఘటన జవహర్ నగర్‌లోని ఆమె నివాసంలో జరిగింది. స్వేచ్ఛ తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. విషయం తెలిసిన వెంటనే చిక్కడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి...
ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య

తెలుగు టెలివిజన్ రంగంలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. ఈ ఘటన జవహర్ నగర్‌లోని ఆమె నివాసంలో జరిగింది.

స్వేచ్ఛ తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. విషయం తెలిసిన వెంటనే చిక్కడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

స్వేచ్ఛ తన తల్లి శ్రీదేవితో కలిసి రామ్‌నగర్‌లో నివాసం ఉంటూ, టీవీ యాంకర్‌గా యాక్టివ్‌గా విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్నేళ్ల కిందట భర్త క్రాంతి కిరణ్ తో విడాకులు తీసుకోవడంతో, కూతురితో కలిసి రామ్ నగర్ లోని తల్లిదండ్రులతో పాటు ఉంటున్నారు. ఆమె ఆత్మహత్య వార్త తెలిసిన వెంటనే స్నేహితులు, సన్నిహితులు ఆసుపత్రికి చేరుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ఇంతకీ ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈ ఘటనపై టీవీ పరిశ్రమలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. సహ ఉద్యోగులు, అభిమానులు ఆమె మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading