తెలంగాణను మరోసారి వానలు అతలాకుతలం చేయనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురవగా, హైదరాబాద్‌లో గరిష్ఠంగా 12 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా అమీర్‌పేట్, పంజాగుట్ట, మణికొండ ప్రాంతాల్లో వరదనీరు ఊహించని రీతిలో చేరి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.
ఇంకా నిన్నటి ప్రభావం నుంచి కోలుకోని వేళ, వాతావరణ శాఖ తాజా అప్డేట్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు తూర్పు మరియు దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
హెచ్చరికల జిల్లాలు
అతి భారీ వర్షాలకు అవకాశం ఉన్న జిల్లాలు: హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్
భారీ వర్షాలకు అవకాశం ఉన్న ఇతర జిల్లాలు: మిగిలిన అన్ని జిల్లాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు
ఐదు రోజుల వానల అలర్ట్: తేదీ వారీగా వర్ష సూచన
ప్రజలకు సూచనలు