12ఏ రైల్వే కాలనీ మూవీ రివ్యూ
Published నవంబర్ 23, 2025 by Srinivas
12ఏ రైల్వే కాలనీ మూవీ రివ్యూ
అల్లరి నరేశ్ నటించిన చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. ‘మా ఊరి పొలిమేర’, ‘నాని కాసరగడ్డ దర్శకత్వం వహించారు. కామాక్షి భాస్కర్ల కథానాయిక. పొలిమేర 2’ దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్ ప్లే మాటలు అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ చిత్రం ఎలా ఉంది? అల్లరి నరేశ్ ఖాతాలో హిట్ పడిందా? చూద్దాం.

కథ:
కార్తీక్ (అల్లరి నరేష్) అనాథ. ఎంతో కాలంగా ఎమ్మెల్యే కావాలని తపనపడుతున్న రాజకీయ నాయకుడు టిల్లు (జీవన్ కుమార్)కు కుడి భుజంలా ఉంటాడు. గెలుపు కోసం తిళ్ళు ఇచ్చిన టాస్క్ లు చేస్తుంటాడు. తన పక్కింట్లో ఉండే ఆరాధన(కామాక్షి భాస్కర్ల) ఇష్టపడతాడు. ఆమెకు బాడ్మింటన్ ప్లేయర్ . సింగపూర్ టోర్నమెంట్‌కు వెళ్లడానికి మూడు లక్షల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కార్తిక్ ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఓ రోజు ఆరాధనను కలవడానికి తన ఇంటికి వెళ్తాడు, అక్కడ అనూహ్య ఘటన చూసి షాక్ఆ అవుతాడు. ఆరాధన, ఆమె తల్లి శవాలుగా పడి ఉంటారు. అసలు వారిని చంపింది ఎవరు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రానా ప్రతాప్ (సాయి కుమార్) ఎలా పరిష్కరించారు. ముంబైలో ఉన్న డాక్టర్ జయదేవ్ షిండే (అనీష్ కురువిల్లా)కు, సంబంధం ఏంటి? అన్నది కథ.

విశ్లేషణ:
ఓ యదార్థ సంఘటనల ఆధారంగా మర్డర్ మిస్టరీగా కథ తయారు చేశారు. దీనికి తాంత్రికం, ఆత్మలు అంశాలను జోడించి హారర్ థ్రిల్లర్‌గా మలిచారు. ఫస్టాఫ్ అంతా హీరో పరిచయం, స్నేహితులు, తను ఉండే రైల్వే కాలనీ, అమ్మాయి వెంట పడటం వంటి సన్నివేశాలతో సాగుతుంది, టిల్లు (జీవన్) చేయించే తాంత్రిక పూజల నేపథ్యం కాస్త రూట్ మార్చిన అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం పట్టింది. సెకెండాఫ్ అంతా ఆరాధన హత్య, దాని వెనకున్న మిస్టరీతో నడుస్తుంది. ఆరాధన మర్డర్‌ను చేధించడానికి హీరో చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. అసలు ఈ మర్డర్ వెనకున్నది ఎవరో చెప్పడానికి క్లైమాక్స్ దాకా టైమ్ తీసుకున్నాడు దర్శకుడు. ఈ తరహా కథల్లో కొన్ని లాజిక్స్ మస్ట్‌గా ఫాలో కావాలి. దర్శకుడు అవేమి పఠిన్చచుకోలేదు. థ్రిలర్ సినిమా నడుస్తుంటే ఎగ్జైట్‌మెంట్ ఫీల్ కావాలి. అది ఎక్కడ లేదు.

ఆర్టిస్టుల విషయానికొస్తే అల్లరి నరేశ్ పాత్ర మేరకు బాగానే చేసారు. వినోదాత్మక పాత్రలు చేసే నరేష్ ఇందులో సీరియస్ టోన్‌లో కనిపించాడు. ఈ సినిమా కోసం నరేష్కా కొత్తగా చేసింది ఏమి లేదు. ఆరాధన పాత్ర సినిమాకు చాల కీలకం. ఆమె చుట్టే కథ తిరుగుతుంది. ఆమె పాత్రకు న్యాయం చేసింది నటనకు స్కోప్ ఉన్నా ఉపయోగించుకోలేకపోయారు. సాయికుమార్, జీవన్, అనీష్ కురువిల్లా పాత్రల మేరకు నటించారు. గెటప్ శ్రీను, వైవా హర్షా ఉన్నా కామెడీ కరువైంది. క్లైమాక్స్ లో అభిరామి ఎంట్రీ అదిరింది. ఆమె పాత్ర మాత్రం రిజిస్టర్ అవుతుంది. భీమ్స్ సంగీతంలో కొత్తదనం లేదు. తమన్ పూనినట్లు బాదుడు బాదేశాడు. కుశేందర్ రమేశ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్ ఇంకాస్త పని చేయాల్సింది. శ్రీనివాస చిట్టూరి బ్యానర్ స్థాయిలో నిర్మాణ విలువలు లేవు. చివరి 15 నిమిషాలు కాస్త బలంగా రాసుకున్నారు. అది కాస్త లెంగ్త్ ఎక్కువే అయినా అభిరామి నటన దానిని మరచిపోయేలా చేసింది. క్లైమాక్స్ ట్విట్ మాత్రం బావుంది. చివరి 10 నిమిషాల కోసం ప్రేక్షకుడు రెండున్నర గంటలు టైం స్పెండ్ చేయలేదు. ఇదొక థ్రిల్లర్ అని వెలిస్తే నిరాశ తప్పదు.
Rating: 



(2/5)
