Download App
Movie Poster

Razor

Cast: Ravi Babu, Tanish, Banerjee, Mirchi Hemant, Veerayya Chowdary

Director: Ravi Babu

Music Director: Rajesh S S

Producer: Ravi Babu, Daggubati Suresh Babu

Release Date: May 8, 2026

రేజర్ మూవీ రివ్యూ

Published మే 8, 2026 by Srinivas

వినూత్న కథలకు రవిబాబు పెట్టింది పేరు. ఎలాంటి కథతో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తారనేది అప్‌డేట్స్ చూసేవరకూ ఎవ్వరికీ తెలియదు. ఈసారి రవిబాబు ‘రేజర్’ అనే క్రేజీ టైటిల్‌తో ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ట్రైలర్ చూసిన వారంతా వామ్మో అంత వయొలెన్సా? అని భయపడిపోయారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆకట్టుకునేలా ఉందా? చూద్దాం.

Razor Review and Rating

క‌థేంటంటే..

సీసీ కెమెరాల కంపెనీ నిర్వహించే విష్ణు (త‌నీష్‌)కు భార్య లక్ష్మి, కూతురే ప్రపంచం. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలనుకున్న హోంమంత్రి కనకరాజు (వీరన్న చౌదరి).. సీఎం సీతారామయ్య (రామరాజు)ను హత్య చేయిస్తాడు. అదంతా విష్ణు అమర్చిన సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి మరీ సీఎంను చంపిస్తే అది సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యిందని తెలిసి కంగారుపడిన హోంమంత్రి ఆ వెంటనే విష్ణుని సైతం హత్య చేయిస్తాడు. అయితే విష్ణు మాత్రం సీసీ కెమెరా విజువల్స్ ముఖ్యమంత్రికి సంబంధించిన గ్యాంగ్‌కు దొరక్కుండా త్రీ-లేయర్ పజిల్‌గా మార్చి, తన కూతురు తేజు (బేబీ తేజల్ విద్యాతి) బొమ్మలో దాచేస్తాడు.. అయితే విష్ణు హత్యను అతని కూతురు తేజు చూస్తుంది. దీంతో పాప కూడా ప్రాణాపాయ స్థితిలో పడిపోతుంది. అప్పుడు ఆ పాపను రక్షించే బాధ్యత రేజర్ (రవిబాబు) తీసుకుంటాడు. కుక్కల సంరక్షుడిగా పని చేసే రేజర్ అసలు కథేంటి? అతడు పాపను ఎలా రక్షించాడు? రుద్ర ఎవరు? వంటి అంశాలను వెండితెరపై చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

ఇంచుమించుగా ఇలాంటి కథలు గతంలో చాలా వచ్చాయి. తండ్రి హత్యకు గురవడం.. ఆ దృశ్యాన్ని చూసిన అతని కూతురు డేంజర్‌లో పడటం.. పాపను రక్షించేందుకు హీరో ఎంటర్ అవడం వంటి అంశాలతో గతంలోనే కథలు వచ్చాయి. కథలు ఎక్కడి నుంచో పుట్టుకురావు. అవే కథలు దాదాపుగా రిపీట్ అవుతూనే ఉంటాయి. కానీ వాటిని వినూత్నంగా మలచడంలోనే దర్శకుడి ప్రతిభ దాగుంటుంది. ఈ విషయంలో రవిబాబు అయితే ఏమాత్రం ఫోకస్ పెట్టలేదనే అనిపిస్తోంది. తొలి 15 నిమిషాల్లోనే అసలు కథను నడిపించేసి.. మిగిలిన కథంతా పాపను రక్షించడం.. త్రి లేయర్స్‌గా ఉన్న వీడియోను కనిపెట్టి బయట పెట్టడం వంటి అంశాల చుట్టూనే తిరుగుతుంది. పోనీ పాపను రక్షించే సన్నివేశాలు ఏమైనా ఆసక్తికరంగా ఉన్నాయా? అంటే అదీ లేదు. చాలా పేలవంగానూ.. చూసేవారికి విసుగు పుట్టించేలా ఉంటాయి. అది చాలదన్నట్టుగా రక్తం ఏరులా పారించేశాడు. కొన్ని సన్నివేశాలు మరింత జుగుప్స కలిగించేలా ఉన్నాయి. ఫోర్క్‌తో కనుగుడ్లు పీకేయడం అయితే పీక్స్ అనే చెప్పాలి. ఇష్టానుసారంగా మనిషులను నరికేయడం.. దారుణమైన హింస.. హత్యలు దారుణంగా అనిపిస్తాయి. కాస్త సున్నిత మనస్కులైతే ఆ వయొలెన్స్‌ను భరించడం కష్టమే. రుద్ర ఎపిసోడ్ ఒకింత కీలకంగా అనిపిస్తుంది. ముగ్గురు నలుగురు మినహా సినిమా అంతటినీ కొత్తవారితోనే రవిబాబు నడిపించేశారు. వారిలోనూ రవిబాబే కీలకం. తేజుని రవిబాబు కాపాడటం చుట్టే సినిమా అంతా నడుస్తుంది. అంతకు మించి సినిమాలో చూడదగిన అంశాలేమీ పెద్దగా లేవు.

Razor Review and Rating

ఎవ‌రెలా చేశారంటే..

ర‌విబాబు సినిమాకు మెయిన్ ఎసెట్. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో భయపెట్టారు. చిన్నారి తేజు నటన ఆకట్టుకుంటుంది. మిగిలిన వారంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్‌గా..

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. సంగీతం అంతగా ఆకట్టుకునేలా లేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. యాక్షన్ చుట్టూనే కథ నడపడంతో రవిబాబు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయారు. చిన్నారి చుట్టూ కథ నడిపినా కూడా భావోద్వేగాలకు అవకాశమే లేకుండా చేశారు. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి. సినిమాకు అన్నీ బలహీనతలే తప్ప చెప్పుకోదగిన బలాలైతే ఏమీ లేవు.

చివరిగా.. ‘రేజర్’ వయొలెన్స్ భరించడం కష్టమే..

Rating: (1.75/5)

మరిన్ని వార్తలు

No categories found.