కన్నప్ప మూవీ రివ్యూ
Published జూన్ 27, 2025 by Srinivas
విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన కన్నప్ప శ్రీకాళహస్తి ఆలయం స్థలపురాణం ఆధారంగా రూపొందిన ఒక మైథలాజికల్ డ్రామా. కథను విష్ణు మంచు రాయగా, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం ఉంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విస్తృతంగా విడుదలైంది.

కథ:
తిన్నడు (విష్ణు మంచు) చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన కారణంగా దేవునిపై నమ్మకం కోల్పోతాడు. తల్లి లేని బిడ్డగా పెరిగిన తిన్నడిని తండ్రి నాతనాథుడు (శరత్ కుమార్) కూడా నిర్లక్ష్యం చేస్తాడు. మరో గ్రామం నుంచి వాయు లింగాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన కాలాముఖుడు (అర్పిత్ రంక) ఘోరంగా మారతాడు.
ఇంతలో, తాము నివసించే అడవిలో ఉన్న వాయు లింగాన్ని స్వాధీనం చేసుకోవడానికి శత్రువుగా వచ్చిన కాలాముఖుడు (అర్పిత్ రంక) తన తమ్ముడినే బలిగా అర్పిస్తాడు. అతడు లక్షల మంది సైన్యంతో యుద్ధానికి సిద్ధమవుతాడు. అతడిని ఎదుర్కొనాలంటే, నాతనాథుడు ఇతర గూడెళ్ల సహాయం కోరాల్సిన పరిస్థితి వస్తుంది.
ఈ క్రమంలో తిన్నడు ప్రేమలో పడిన నెమలి (ప్రీతి ముకుందన్), ప్రత్యర్థి గ్రామ పెద్ద కుమార్తె అని తెలుస్తుంది. దేవుని అవిశ్వాసిగా మారిన తిన్నడు — నెమలి ప్రేమతో ఎలా మారిపోయాడు? ఆ ప్రేమ అతన్ని యుద్ధానికి ఎలా నెట్టింది? తన జీవితంలో అతడు ఏమి కోల్పోయాడు? తిన్నడు నుంచి కన్నప్పగా ఎలా మారాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
కన్నప్ప కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. భక్త కన్నప్ప వంటి క్లాసిక్స్ చూసిన ప్రేక్షకులకు ఇది తెలిసిన కథే కానీ, నేటి తరం వారికీ అంతగా తెలిసుండకపోవచ్చు. అలాంటి కథను మళ్ళీ తెరపైకి తీసుకురావడం పెద్ద సాహసమనే చెప్పుకోవాలి. విష్ణు మంచు ఈ సాహసాన్ని చేయడమే కాదు, కథానాయకుడిగా, రచయితగా, నిర్మాతగా తీవ్రంగా శ్రమించారు.
సినిమా శివపార్వతుల సన్నివేశంతో ప్రారంభమవుతుంది. వెంటనే యాక్షన్, డ్రామాలోకి మారుతుంది. భారీ ల్యాండ్‌స్కేప్స్, యాక్షన్ సీక్వెన్సులు, విజువల్స్ ఆకట్టుకున్నాయి. కానీ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ కథను భావోద్వేగంగా ప్రెజెంట్ చేయడంలో విఫలమయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ డెవస్సీ బీజీఎం కూడా అంతగా ఆకట్టుకోలేదు.
ఫస్ట్ హాఫ్ మామూలుగా అనిపించినా, ప్రభాస్ ఎంట్రీతో సినిమా మూడ్ మారుతుంది. అక్షయ్, కాజల్, మోహన్ బాబు, మోహన్‌లాల్ వంటి స్టార్స్ ఉన్న ప్రతి సన్నివేశం బాగా తీశారు.
వీఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బలహీనంగా కనిపించినా, క్లైమాక్స్ దగ్గర బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి. సంగీత పరంగా మాత్రం బలహీనత కనిపిస్తుంది. ముఖ్యంగా డివోషనల్ టచ్‌లో మ్యూజిక్ బలంగా ఉండాల్సింది.

నటన:
విష్ణు మంచు నిజాయితీగా నటించారు. పాత్ర కోసం ఆయన చేసిన కష్టం స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రీతి ముకుందన్ పాత్రలో గ్లామర్ హైలైట్ అయ్యింది. కానీ భావోద్వేగం లోపించింది.
ప్రభాస్ ఎంట్రీతో థియేటర్లలో వేడి పెరుగుతుంది. ప్రతి సీన్‌కి ఓ వేరే వైబ్ ఉంటుంది.
మోహన్ బాబు డైలాగ్స్‌తో మెప్పించారు.
అక్షయ్ – కాజల్ శివ పార్వతులుగా బాగా ఒదిగిపోయారు.
మోహన్‌లాల్ చిన్న పాత్రలో మెరిశారు.

తీర్పు:
కన్నప్ప అనేది భావోద్వేగాలతో కూడిన భక్తి కథను మోడర్న్ స్కేల్‌లో చూపించే ప్రయత్నం. స్కేలు, స్టార్ పవర్, గ్రాండియర్ వర్క్‌లో ఆకట్టుకోగా… కథనంలో ఎమోషన్, క్రిస్ప్ నేరేషన్ లోపించింది. ప్రభాస్, మ్యూథాలజికల్ యాక్షన్ ప్రేమికులకు ఇది ఓ విజువల్ ఎక్స్‌పీరియెన్స్. తన నటనతో క్లైమాక్స్‌లో విష్ణు మంచు మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు.
Rating: 



(3/5)
