Download App

రెండో రాజధాని చర్చ: తెలంగాణలో కొత్త ఆందోళనలకు నాంది?

జనవరి 8, 2026 Published by Srinivas

రెండో రాజధాని చర్చ: తెలంగాణలో కొత్త ఆందోళనలకు నాంది?

తెలంగాణ ఎందరో బలిదానాల నేపధ్యంలో… కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్న కలల స్వప్నం…. పోరాట వీరుల ఆత్మ గౌరవ నినాదాలతో…. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం పరితపించి సాధించుకున్న రాష్ట్రంలో కొంతమంది…. స్వరం మారుతున్నది.

ఏది నిజం…. ఏది అబద్ధం… అని తరచి చూస్తే….1947 కి ముందు బ్రిటిష్ వాళ్ళు మనకి శత్రువులు…. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వాళ్ళ మీద మనకు క్రమేపి ద్వేషం తగ్గిపోయింది… భారతీయులు బ్రిటిష్ వాళ్ళమీద ఇప్పుడు పోరాడతారా… లేదుకదా…. స్వాతంత్య్రం వచ్చిన తరువాత, మనకు కావలసినది అందిన తరువాత, బ్రిటిష్ వాళ్ళమీద ఇప్పటి తరంలో భారతీయులకు ఏమి కోపం ఉంటుంది. ఉండదా అంటే ఉంటుంది కాని , అప్పటి వాళ్ళకి ఉన్నంత స్థాయిలో ఆ ప్రభావం ఉండదు. అక్కడ వ్యాపార దిగ్గజాలు ఇక్కడి వారితో వ్యాపారం చేస్తారు. ఇక్కడ వ్యాపారస్తులు అక్కడ వ్యాపార సంస్థలతో వ్యాపారం కొనసాగిస్తున్నారు.

అంతేగాని వాళ్ళమీద ఇప్పుడు కూడా ఏదో ఒకటిచేసి సాధిద్దాం అంటే ఎవరైనా వస్తారా….రారు…. ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళిపోయి 75 సంవత్సరాలు అవుతుంది. మనదేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతుంది. బ్రిటిష్ వాళ్ళని కూడా మీరు పాలిస్తేనే బాగుంటుంది అన్నటువంటి తమిళ నాయకులు కూడా ఉన్నారు. అంతమాత్రం చేత స్వాతంత్ర్యం రావడం ఆగలేదు కదా….

ఈ అంశం ఎందుకు వచ్చింది అంటే …

సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారు, మొన్న ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో హైదరాబాద్ రెండవ రాజధాని కాబోతుందా అని యాంకర్ ప్రశ్నించిన నేపధ్యంలో, ఆయన దోరణి, మాటలు చూస్తుంటే హైదరాబాద్ రెండవ రాజధాని కాబోతుంది అన్న కోణం లోనే మాట్లాడారు. మరొక ఉద్యమానికి నాంది పలకాలి అని పిలుపు నిచ్చారు. అందరూ సామూహికంగా వ్యతిరేకించాలి, ఖండించాలి అన్నారు. డిల్లీ లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడం, ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ మూలంగా డిల్లీ మరింత కాలుష్య ముప్పుకు గురి కాబోతుంది. అందుకే హైదరాబాద్ రెండవ రాజధాని కావచ్చు…. కొద్దో గొప్పో “ఆంధ్రా వాళ్ళు” బెటర్…. అనే కోణంలో మాట్లాడారు. ఉత్తర భారతీయులతో తెలంగాణ సంస్కృతి బాగా దెబ్బతింటుంది. మనది ఏమి నడవదు అని ఖరాఖండిగా చెప్పారు.

మొన్నటికి మొన్న కేసీఆర్ కూడా చంద్రబాబును ఆయన చేసిన పనులను కించపరుస్తూ మాట్లాడారు. ఎక్కడా ఆయన వ్యాఖ్యల ప్రభావం కానరాలేదు. పైగా కవిత ఆరోపణాస్త్రాలు సూటిగా కేసీఆర్ కే తగులుతున్నాయి. ఇప్పుడు ప్రజల్లో అంత భావోద్వేగాలు ఉండవు. తెలంగాణ వాదులు లక్ష్యం స్వపరిపాలన, అది నెరవేరిన తర్వాత ఎవరిపై చేస్తారు. ఒంటరిగా చిమ్మ చీకటిలో శత్రువుల మీద కత్తి యుద్ధం చేసినట్టే.

ఇప్పుడు చాలా మంది సచివాలయ అధికారులు గతంలో, ఆంధ్రా అధికారులను దబాయిస్తూ, పని చేయించుకునే వాళ్ళం… ఇప్పుడు అంతా మేమే ఎవరు ఎవరికి భయపడటం లేదు అని క్యాంటీన్లలో మాట్లాడుకోవడం పరిపాటి అయినది. దేశ రెండవ రాజధాని అయితే ఉత్తర భారతీయ అధికారులతో అసలు ఇమడలేము అని సచివాలయంలో కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు అని, కొంతమంది నెటిజన్లు మాట.

అంతర్జాతీయం గాను, దేశ రక్షణ వ్యవస్థ నేపధ్యంలోను…. దేశ భద్రతా వ్యవహారాల శాఖ… హైదరాబాద్ అన్ని విధాల అనుకూలమైనది అని రిపోర్ట్ ఇచ్చినట్లుగా డిల్లీ వర్గాల భోగట్టా… ఒకవేళ దేశ రెండవ రాజధానిగా ప్రకటిస్తే…. ఎలా అనే కోణం లో చాలా మంది ఆలోచనలతో, తలమునకలవుతున్నట్లుగా అర్థం అవుతుంది. దీనిని ఎలా అడ్డుకోవాలి అనే కోణంలోనే మనమందరం కలసి ఒక నిర్ణయం తీసుకోవాలని పాశం యాదగిరి లాంటి అనుభవజ్ఞులైన జర్నలిస్టులు అంటున్నారు అంటే… ఏదో జరుగుతుంది అన్నట్టుగానే భావించాలి.

పోనీ యువతరం పట్టించుకుంటుందా అంటే అదికూడా ప్రశ్నార్థకమే…. యువత ఎక్కువగా సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నది. రోజు రోజుకు పబ్ కల్చర్ కి, డ్రగ్స్ కి, ఎంజాయన్మెంట్ కి తొందరగా ఆకర్షితులు అవుతున్నారు. ఏమి చేసైనా సంపాదించాలి అనే కాంక్ష తప్ప…. సంఘం, సమాజం, సంస్కృతి లాంటివి పట్టించుకునే తత్వాన్ని కోల్పోతున్నారు. ఇటువంటి సమయంలో తెలంగాణ యువత ఏ మేరకు ఈ దేశ రెండవ రాజధాని విషయంలో, ఎలా స్పందిస్తుందో చూడాలి. సిటీలో ఉన్న యువత పట్టించుకునే అవకాశం తక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి పెద్ద తేడా ఉండదు…. రూరల్ సమాజపు స్పందన మీదనే ఆధారపడివుంటుంది ఉద్యమం అంటున్నారు… సోషల్ మీడియా విశ్లేషకులు .

పెద్దవాళ్ళ స్వరం మారుతుంది…. తరం కూడా మారుతుంది… స్పందన చూడాలి.

“నిప్పులేనిదే పొగరాదు” అనేది ఎంత నిజమో…. “ఐక్యమత్యమే మహాబలం” అనేది కూడా అంతే నిజం. అర్ధం అయిన వారికి అర్ధం అయినంత మహాదేవ.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading