Download App

ద్రవిడనాట ‘కమల ఛత్రం’ నుండి సొంత గూడు ఏర్పాటుకి… ‘అన్నామలై’

జూన్ 6, 2026 By Suresh Thota
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK)ల చుట్టూనే తిరిగిన ద్రావిడ రాజకీయం.. ఇప్పుడు సరికొత్త ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేస్తోంది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి, తమిళనాడులో బీజేపీ కాషాయ జెండాను బలంగా నిలబెట్టేందుకు రాజకీయాల్లోకి వచ్చిన కె. అన్నామలై, ఇప్పుడు ఆ...
ద్రవిడనాట 'కమల ఛత్రం' నుండి సొంత గూడు ఏర్పాటుకి… 'అన్నామలై'

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK)ల చుట్టూనే తిరిగిన ద్రావిడ రాజకీయం.. ఇప్పుడు సరికొత్త ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేస్తోంది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి, తమిళనాడులో బీజేపీ కాషాయ జెండాను బలంగా నిలబెట్టేందుకు రాజకీయాల్లోకి వచ్చిన కె. అన్నామలై, ఇప్పుడు ఆ బీజేపీ పార్టీ కి కూడా గుడ్ బై చెప్పి “We The Leaders” అనే కొత్త ఉద్యమ వేదికను ప్రకటించడం తీవ్ర సంచలనంగా మారింది. ఇది కేవలం ఒక సామాజిక వేదిక మాత్రమే కాదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారి బరిలోకి దిగుతుందని ఆయన స్పష్టం చేయడం తమిళనాడు రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది.

అన్నామలై సరికొత్త రాజకీయ ప్రయోగానికి క్షేత్రస్థాయి నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. ఆయన పిలుపునిచ్చిన కేవలం ఒక్క రోజులోనే అంటే కేవలం 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా వాలంటీర్లు ఈ “We The Leaders” వేదికలో తమ పేరు నమోదు చేసుకోవడం ఒక రికార్డుగా చెప్పవచ్చు. ఈ నంబర్ కేవలం సోషల్ మీడియా బజ్ మాత్రమే కాదు, అన్నామలై పట్ల యువతలోఉన్న క్రేజ్, మరియు మార్పును కోరుకునే సామాన్య ప్రజల్లో ఉన్న ఆదరణకు ఇది ప్రత్యక్ష నిదర్శనం.

తమిళనాడులో సినిమా గ్లామర్, కుటుంబ వారసత్వం లేకుండా రాజకీయాల్లో రాణించడం ఒక పెద్ద సవాల్. ఇటీవల సినీ నటుడు విజయ్ తన ‘టీవీకే’ (TVK) పార్టీ ద్వారా రేసులోకి రాగా, ఇప్పుడు అన్నామలై నేరుగా ప్రజలనే భాగస్వాములను చేస్తూ “వ్యక్తి పూజ”, “కుటుంబ రాజకీయాలకు” వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో శక్తులను ఏకం చేస్తున్నారు. తమిళనాట కొత్త రాజకీయ విధానానికి ఊపిరి పోస్తున్నారు. ఇది పాత మూస తరహా రాజకీయాలను వదిలించుకుని, నవతరం అంటే జెన్ జీ కొత్తగా అవినీతి కి తావులేని రాజకీయాలని ఆహ్వానిస్తుంది.

​ అన్నామలై వెంట నడుస్తున్న బీజేపీ నేతలు

ఈ పరిణామం కేవలం అన్నామలై వ్యక్తిగత నిర్ణయానికే పరిమితం కాలేదు, తమిళనాడు బీజేపీ పునాదులను కదిలిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, కొంతమంది కీలక తమిళ బీజేపీ నాయకులు కూడా అన్నామలై వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. తమిళనాడులో బీజేపీకి ఒక ప్రత్యేక గుర్తింపు, దూకుడు తీసుకొచ్చిన నేత అన్నామలై. ఇప్పుడు ఆయనతో పాటు బీజేపీ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నాయకులు కూడా కమలాన్ని వీడి ఆయన వెంటే వస్తుండటం రాష్ట్రంలో బీజేపీ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చే ప్రమాదం ఉంది. ​పార్టీ క్యాడర్, క్షేత్రస్థాయి నాయకత్వం కూడా అన్నామలై వైపు మళ్లుతుండటంతో, తమిళనాడులో బీజేపీ మళ్లీ మొదటికొచ్చినట్లయింది.

ద్రవిడనాట 'కమల ఛత్రం' నుండి సొంత గూడు ఏర్పాటుకి… 'అన్నామలై'

అన్నామలై ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారు…

నిజం చెప్పాలంటే, అన్నామలై కి అన్నాడీఎంకే తో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. కాని బీజేపీ అధిష్టానం మాట కొట్టివేయడం ఇష్టం లేక మౌనం గా ఉండిపోయారు. అధిష్టానం మాత్రం అన్నాడీఎంకే కి తలవొగ్గి, అన్నామలై ని బీజేపీ రాష్ట్ర బాధ్యతల నుండి తప్పించింది. తెలంగాణ లో బండి సంజయ్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు పక్కన పెట్టినట్లుగా, అన్నామలై ని కూడా అక్కడ బాధ్యతల నుండి తప్పించింది. ఆరోజే అన్నామలై పార్టీ నుండి బయటకు రావాలి. బీజేపీ 3.6 శాతం నుండి 12 శాతం ఓటు బ్యాంకు పెరిగింది అంటే దానికి కారణం ముమ్మాటికి అన్నామలై నే కారణం. కాని ఒంటరిగా పోటీ చేద్దాం అనే ఆయన మాట వినకుండా, మిగతా నాయకుల మాట విని తప్పటడుగు వేసింది బీజేపీ అని తమిళ యువత సోషల్ మీడియాలో బీజేపీ పై కోపం వెళ్లగక్కారు. అయిన అధిష్టానం వినలేదు పంటి బిగువున ఆ బాధను భరించి, ఎన్నికల పలితాలు వెల్లడి అయిన తరువాత బీజేపీ పెద్దలకు, తాను ఈ పార్టీ లో ఉండలేనని వాళ్ళకి తెలియజేసి బయటకు వచ్చేశారు అన్నామలై.

​బలాలు మరియు అసలైన సవాళ్లు

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అన్నామలై కున్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఆయన వ్యక్తిగత ఇమేజ్. మాజీ ఐపీఎస్ అధికారిగా ఆయనకున్న క్రమశిక్షణ, అవినీతి మరకలు లేని క్లీన్ ట్రాక్ రికార్డ్ ప్రజల్లో ఒక పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేసింది. ​అయితే ఒక ప్రాంతీయ శక్తి గా ఎదగడానికి ఆయన ముందు కొన్ని సవాళ్లు పొంచి ఉన్నాయి. తమిళనాట ​పోలింగ్ బూత్ మేనేజ్‌మెంట్ అంటే ఒక రకంగా కత్తి మీద సాము లాంటిది. తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకేలకు ప్రతి గ్రామంలోనూ పటిష్టమైన బూత్ స్థాయి కమిటీలు ఉన్నాయి. వాళ్ళను గైడ్ చేస్తూ , అనుసంధాన కర్తగా కేంద్ర కార్యాలయం పని చేస్తూ ఉంటుంది. అన్నామలై “We the leaders” సోషల్ మీడియా వేదికగా, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లలో కనిపించే ఈ 10 లక్షల మంది మద్దతును.. ఎన్నికల రోజు పోలింగ్ బూత్ దగ్గర ఓట్లుగా మార్చడమే అన్నామలై ముందున్న అసలైన టాస్క్. ఇదే సమయంలో సొంతంగా ఒక రాష్ట్రవ్యాప్త పార్టీని నడపడానికి, ఎన్నికలను తట్టుకోవడానికి భారీగా ఖర్చు చేయగలిగిన ఆర్థిక బలం, వనరుల నిర్వహణ అత్యంత కీలకం. ఒక కొత్త ఉద్యమానికి ప్రజా మద్దతు ద్వారా నిధులు సమకూర్చుకోవడం అంత సులువు కాదు.

​ముగింపు: “We The Leaders” సాధించే విజయాన్ని ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటే అవుతుంది. కానీ, రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మాత్రం చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన పంచకోణ పోటీకి (DMK, AIADMK, TVK-Vijay, BJP, Annamalai) వేదిక కాబోతున్నాయన్నది స్పష్టం. ప్రస్తుత TVK ముఖ్యమంత్రి ​ “ఇళయ దళపతి విజయ్”, నిజాయితీ, నిబద్ధత కలిగిన మాజీ ఐపీఎస్ తన వ్యూహాలతో, భారీ ప్రజా మద్దతుతో “అన్నామలై”…., సాంప్రదాయ ద్రవిడ పార్టీల ఓట్లను ఎంతవరకు చీల్చగలరో రాబోయే కాలమే నిర్ణయిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ద్రవిడ కోటలో మార్పు కోసం అన్నామలై వేసిన ఈ అడుగు తమిళనాడు రాజకీయాలకు ఒక కొత్త దశ ,దిశను నిర్దేశిస్తాయి అనేది ఖాయం.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading