Download App

స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌లో మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గింపు యోచన: పొంగులేటి

జూలై 7, 2025 • By Rahul N
స్థిరాస్తి రిజిస్ట్రేషన్లలో మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే అంశంపై ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల చట్టంలో అవసరమైన మార్పులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2025 సవరణ బిల్లు...
స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌లో మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గింపు యోచన: పొంగులేటి

స్థిరాస్తి రిజిస్ట్రేషన్లలో మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే అంశంపై ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

రిజిస్ట్రేషన్ల చట్టంలో అవసరమైన మార్పులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2025 సవరణ బిల్లు రూపొందించాలని, అలాగే రాబోయే శాసనసభ సమావేశంలో ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.

సమీక్షలో తీసుకున్న కీలక నిర్ణయాలు:

  • మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గింపు
  • పాత ప్లాట్లకు వర్తింపజేసే యోచన
  • భూముల ధరల సవరణపై శాస్త్రీయ అధ్యయనానికి చర్యలు
  • కార్పొరేట్ సేవలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు దోహదం

ఈ చర్యలు అమలైతే, రిజిస్ట్రేషన్ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారనుంది. ఈ సవరణల వల్ల రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెరిగే అవకాశముందని మంత్రి అన్నారు అంతేకాక మోసాలను కూడా అరికట్టవచ్చన్నారు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading