Download App
Movie Poster

Ghaati

Cast: Anushka Shetty, Vikram Prabhu, Chaitanya Rao, Jagapathi Babu, Ramyakrishna, Jishnudev Guptha, Raghav Rudra, John Vijay, Ravindra Vijay

Director: Krish Jagarlamudi

Music Director: N Vidya Sagar

Producer: Rajeev Reddy Yeduguru

Banner: UV Creations

Release Date: September 5, 2025

ఘాటీ మూవీ రివ్యూ

Published సెప్టెంబర్ 5, 2025 by Srinivas

ఘాటీ రివ్యూ: తూరుపు కనుమల్లో తడబడిన క్రిష్ గమ్యం

విక్రం ప్రభు, అనుష్క జంటగా నటించిన సినిమా ‘ఘాటీ’. క్రిష్ దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి ప్రొడ్యూస్ చేశారు. పాన్ ఇండియా రిలీజైన ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి.

‘బాహుబలి’ తర్వాత కథానాయికగా తన గమనాన్ని అనుష్క మార్చింది. కమర్షియల్ హీరోయిన్ రోల్స్‌కు దూరంగా, మహిళా ప్రాధాన్య కథలకు దగ్గరగా ప్రయాణిస్తోంది. ఆ బాటలో వచ్చిన సినిమా ‘ఘాటీ’. హీరోలకు తీసిపోని రీతిలో అనుష్క యాక్షన్ సీన్స్ చేశారని ప్రచార చిత్రాలతో తెలుస్తుంది. క్రిష్ ఎటువంటి సినిమా తీశారు? అనుష్క ఎలా చేశారు? అనేది సమీక్ష చదివి తెలుసుకోండి.

ఘాటీ రివ్యూ

కథ:

ఒరిస్సాలోని కోరాపుట్‌లో ఒక ల్యాబులో దేశిరాజు (విక్రం ప్రభు) ఉద్యోగి. బస్ కండక్టర్ శీలావతి (అనుష్క) అతడి మరదలు. బావ అంటే విపరీతమైన ప్రేమ కురిపిస్తుంది. ఆంధ్రా – ఒరిస్సా సరిహద్దుల్లోని ఘాట్లు వాళ్ళ సొంతూరు. జీవనోపాధి కోసం ఆ ప్రాంతంలో ప్రజలంతా గంజాయి మోసే ఘాటీలుగా పని చేస్తారు. ఆ బ్రతుకు వద్దనుకుని దేశిరాజు, శీలావతి వేరే ఉద్యోగాలు చూసుకుంటారు.

సంతోషంగా దేశిరాజు, శీలావతి ఏడడుగులు వేయడానికి సిద్ధమైన తరుణంలో ఆ జంటను చంపడానికి గంజాయి సాగు, సప్లైని శాసించే కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), కందుల నాయుడు (చైతన్య రావు) వస్తారు. ఎందుకు? మళ్ళీ ఆ జంట ఘాటీ పని ఎందుకు ప్రారంభించింది? ఘాటీల బ్రతుకుల్లో గంజాయి ఎటువంటి పాత్ర పోషించింది? శీలావతి ఏం చేసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Ghaati Movie Review

విశ్లేషణ:

అప్పటివరకు తప్పులు చేసిన మనిషిలో ఒక్కసారి మార్పు రావడం పాత సినిమాల్లో చూసే టెంప్లేట్. కొన్నేళ్ల క్రిందట చెల్లుబాటు అయ్యింది. హీరో అంటే మంచోడు అవ్వాలని, ప్రజలకు స్ఫూర్తి ప్రధాతగా ఉండాలని కట్టుబాట్లు ఉండేవి. కేజీఎఫ్, సలార్, పుష్ప సినిమా విజయాలతో హీరోలో నెగిటివ్ షేడ్స్ ఉన్నా ఆడియన్స్ ఆందరిస్తారని అర్థమైంది. ఆ సినిమాల తరహాలో సిల్వర్ స్క్రీన్ మీద కొత్త వరల్డ్ క్రియేట్ చేయాలని తాపత్రపడ్డారు క్రిష్. న్యూ వరల్డ్ క్రియేట్ చేశారు కూడా! కానీ మంచి చెడు మధ్య ఎటు వైపు దారి ఎంపిక చేసుకోవాలో తెలియక తడబడ్డారు.

స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పులు చేసి చివర్లో ఒక్కసారిగా తాము చేసింది తప్పు అని తెలుసుకుని మంచి చేసిన హీరో హీరోయిన్ల క్యారెక్టర్లతో సినిమాలు తీయడం కొన్నేళ్ల క్రిందట నడిచిన ట్రెండ్‌లో ‘ఘాటీ’ తీశారు క్రిష్. తూరుపు కనుములు విజువల్స్ పరంగా కొత్తదనం తెచ్చాయి. కథలో కనీసం ఇసుమంతైనా కొత్తదనం లేదు. నలుగురికి మంచి చేయడం కోసం చెడ్డదారిలో ప్రయాణించినా ప్రాబ్లమ్ కాదన్నట్టు క్రిష్ సినిమాలో మెయిన్ లీడ్ క్యారెక్టర్లు బిహేవ్ చేయడం సర్‌ప్రైజ్ చేస్తుంది. ఒక్కసారిగా మనసు మార్చుకోవడం నమ్మేట్టు లేదు. క్యారెక్టర్ స్వింగ్స్ స్టోరీ ఫ్లోని డిస్టర్బ్ చేశాయి.

ఘాటీ రివ్యూ

క్రిష్ సినిమాల్లోని సన్నివేశాల్లో ఎమోషనల్ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ‘ఘాటీ’లో మాత్రం కమర్షియాలిటీకి పెద్దపీట వేశారు. అనుష్కతో ఓవర్ ది టాప్ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారు. హీరోయిన్ ఇమేజ్ వల్ల బిలీవబిలిటీ కనిపించింది. కానీ క్రిష్ మార్క్ ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయ్యింది. మంచి సీన్స్ రాసుకున్నా ప్రోపర్ ఎలివేషన్స్ ఇవ్వలేదు. రొటీన్ కథ, కమర్షియల్ సీన్స్ మధ్య సినిమా నలిగింది. కానీ పాటల్లో వినిపించిన సాహిత్యం, సినిమాటోగ్రఫీలో క్రిష్ తన అభిరుచి చాటుకున్నారు. సంగీతంలో కొత్త సౌండింగ్ వినిపించింది. సినిమాటోగ్రఫీ ప్లజెంట్‌గా ఉంది. యాక్షన్ సీన్స్‌లో రౌద్రం కనిపించింది. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ కుదరలేదు.

Anushka Ghaati Review

అనుష్క ఇమేజ్ ‘ఘాటీ’కి ప్లస్ అయ్యింది. దేవసేనకు తగ్గట్టు కొన్ని సీన్లు రాశారు క్రిష్. ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్ కూడా బావుంది. రౌద్రరసం బాగా పలికించింది. విక్రం ప్రభుకు తెలుగులో మంచి డెబ్యూ ఇది. తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేశారు. రవీంద్ర విజయ్ వంటి ప్రతిభావంతుడైన నటుడిని డామినేట్ చేసేలా చైతన్య రావు విలనిజం పండించాడు. ఇన్నాళ్లూ స్క్రీన్ మీద చూసిన చైతన్య వేరు. ఈ మూవీలో చైతన్య వేరు. బాడీ లాంగ్వేజ్ నుంచి ఎక్స్‌ప్రెషన్స్‌ వరకు స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ మిగతా వాళ్ళను తినేశాడు. జగపతిబాబుది సపోర్టింగ్ రోల్. ఉన్నంతలో బాగా చేశాడు. రాజు సుందరం, జిష్షుసేన్ గుప్తా, జాన్ విజయ్, లారిస్సా బోనేసి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఘాటీ రివ్యూ

తీర్పు:

క్రిష్ నుంచి ఎక్స్‌పెక్ట్‌ చేయని ప్రోడక్ట్ ‘ఘాటీ’. యాక్షన్ సన్నివేశాల్లో ఘాటు బాగా దట్టించారు. కానీ ఆయన్నుంచి ఎక్స్‌పెక్ట్‌ చేసే ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ చేశారు. ఫైనల్లీ కొత్త వరల్డ్ క్రియేట్ చేశారు. రొటీన్ రివేంజ్ కథను కొత్త విజువల్స్‌తో చూపించారు. క్రిష్, అనుష్క కష్టం కోసం ఒక్కసారి చూసే ప్రయత్నం చేయవచ్చు.

Rating: (2.5/5)

మరిన్ని వార్తలు

No categories found.