Download App
Movie Poster

Anumana Pakshi

Cast: Rag Mayur, Merin Philip, Prince Cecil, Rasi, Charith, Brahmaji, Ajay

Director: Vimal Krishna

Music Director: Sricharan Pakala

Producer: Rajiv Chilaka, Megha Chilaka, Sneha Rajesh Jagtiani, Vihan Dand

Release Date: September 25, 2026

అనుమాన పక్షి మూవీ రివ్యూ

Published సెప్టెంబర్ 25, 2026 by Srinivas

‘డీజే టిల్లు’ ఫేమ్‌ విమల్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అనుమాన పక్షి’ నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుమానం.. అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ‘డీజే టిల్లు’తో విమల్ కృష్ణ మంచి సక్సెస్ సాధించి ఉండటంతో ‘అనుమాన పక్షి’పై కూడా అంచనాలు పెరిగాయి. మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అంటూ మేకర్స్ ప్రమోషన్స్‌లో చెప్పడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం.

అనుమాన పక్షి Review and Rating

కథేంటంటే..

సన్నీ (రాగ్ మయూర్) విశాఖపట్నంలో ‘అనుమాన పక్షి’ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతుంటాడు. సన్నీకి అనుమానం ఎక్కువ. ప్రతి క్షణం ప్రతి దాన్ని అనుమానిస్తూ ఉంటాడు. అలాంటి సన్నీకి ఒకరోజు అతని స్నేహితుడు అనంత్ (చరిత్) నుంచి ఫోన్ వస్తుంది. తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని.. కశ్మీర్ వెంటనే రావాలని లేదంటే అతని పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తాడు. దీంతో సన్నీ వర్మ (ప్రిన్స్ సెసిల్), మరో స్నేహితుడితో కలసి కశ్మీర్‌కు వెళతాడు. అక్కడ సన్నీకి కన్య (మెరిన్ ఫిలిప్) పరిచయమవుతుంది. ఆమెతో కలిసి ట్రావెల్ చేసిన మీదట ఆమె తనను ప్రేమిస్తోందని సన్నీ భావిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే వర్మ మరణిస్తాడు. అతని మరణంతో సన్నీ చిక్కుల్లో పడతాడు. మరోవైపు కంటెంట్ క్రియేషన్‌పై పిచ్చి ఉన్న పోలీస్ అధికారి వాసు (అజయ్) తన భార్య సుజీ (రాశి)తో కలిసి కశ్మీర్‌కు వస్తాడు. సుజీకి ఆత్మలతో మాట్లాడే శక్తులు ఉంటాయి. అలా వర్మ మరణాన్ని ఆమె గుర్తిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? అసలు వర్మ ఎలా మరణించాడు. సన్నీని కన్య నిజంగానే ప్రేమించిందా? సన్నీ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే..

‘డీజే టిల్లు’ ఫేమ్ నుంచి సినిమా వస్తోందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. సినిమా అదే విధమైన కామెడీతో అలరిస్తుందేమోనన్న భావనే అందుకు కారణం. కానీ ఈ సినిమా విషయానికి వస్తే డైరెక్షనే ప్రధాన బలహీనతేమో అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, కథ, కథనం, పాటలు ఏవీ కూడా అలరించేలా లేవు. ఇవన్నీ ఎలా ఉన్నా కామెడీ బాగా వర్కవుట్ అయ్యిందంటే అన్నీ మరుగున పడతాయి. కనీసం కామెడీ కూడా వర్కవుట్ కాలేదు. అజయ్, రాశి, బ్రహ్మాజీ వంటి మంచి నటులనే తీసుకున్నారు కానీ వారిని వినియోగించుకోలేకపోయారు. కనీసం మెరిన్ విషయంలో ఇచ్చిన ట్విస్ట్ అయినా ఆసక్తికరంగా ఉందా అంటే అదీ లేదు.సినిమాలో కనీసం గుర్తుండిపోయే అంశాలు కానీ ఆసక్తికరమైన పాత్రలు కానీ లేవు. ప్రతి క్షణం.. ప్రతి విషయాన్ని అనుమానించే సన్నీ.. తన మనసులో తలెత్తే ప్రతి అనుమానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ కనీసం ఆ అనుమానాలు కూడా ఫన్నీగా అనిపించవు. తన అనుమానాల కారణంగా ప్రశాంతతను కోల్పోయిన ఓ వ్యక్తి.. ఎదుటి వారికి సైతం ప్రశాంతత లేకుండా చేస్తాడు. దీని నుంచి మంచి కామెడీ జెనరేట్ చేయవచ్చు. కానీ అదేం జరగలేదు. కనీసం సన్నివేశాల్లో బలం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు పోలీస్ ఆఫీసర్‌తో చేయించే రీల్స్ మరింత విసుగు తెప్పించేలా ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమా చూసేవారికి పెద్ద పరీక్షే.

అనుమాన పక్షి Telugu Review

ఎవరెలా నటించారంటే..

ఇప్పటికే రాగ్ మయూర్‌ పలు చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితుడే. కానీ ప్రధాన పాత్ర చేయడం ఇదే ప్రథమం. కానీ తనకు వచ్చిన అవకాశాన్ని రాగమయూర్ పూర్తిగా వినియోగించుకున్నట్టు కనిపించలేదు. రాగమయూర్ నటన పర్వాలేదనిపిస్తుంది. మెరిన్ పాత్రను సైతం దర్శకుడు స్ట్రాంగ్‌గా డిజైన్ చేయలేదు. నటనకు పెద్దగా స్కోప్ లేని పాత్ర ఆమెది. అయినా కూడా కనిపించినంత మేర బాగానే అనిపించింది. అజయ్ కామెడీ రోల్ చేశాడు. ఆయన నటన బాగుంది. రాశికి పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదు. బ్రహ్మాజీ కామెడీ సైతం వర్కవుట్ కాలేదు. వీరంతా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

టెక్నికల్ పరంగా..

శ్రీచరణ్ పాకాల అందించిన మ్యూజిక్ సినిమాకు ఏమాత్రం ప్లస్ అవలేదు. పాటలు ఏమీ బాగాలేవు. విమల్ కృష్ణ అందించిన కథలో కానీ.. నడిపించిన కథనంలో కానీ దమ్ము లేదు. కెమెరా పనితనం పర్వాలేదనిపించింది. అవసరం లేని చోట ఏఐ సన్నివేశాలు వాడారు. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగానే ఉన్నాయి.

ఫైనల్‌గా.. విసుగు తెప్పించే ‘అనుమాన పక్షి’

Rating: (1.75/5)

మరిన్ని వార్తలు

No categories found.