Download App
Movie Poster

Dorothy

Cast: Keerthy Suresh, Sananth, Rishikanth

Director: Karthik Subbaraj

Music Director: Ilaiyaraaja

Producer: Jyoti Deshpande, Guneet Monga Kapoor, Achin Jain

Release Date: October 2, 2026

డోరతీ మూవీ రివ్యూ

Published అక్టోబర్ 2, 2026 by Srinivas

కార్తిక సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డోరతీ’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో డోరతీ ప్రీమియర్స్ వేయడం జరిగింది. అలాంటి ఈ సినిమా మలేషియా సెన్సార్ బోర్డును సంతృప్తి పరచలేకపోయింది. దీంతో ఈ సినిమాపై ఆ దేశంలో బ్యాన్ విధించడంతో హాట్ టాపిక్‌గా మారింది. అసలంతగా ఆ సినిమాలో ఏముందనేది చర్చనీయాంశంగా మారింది. మరి సినిమాలో ఏముంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? తెలుసుకుందాం.

Dorothy Review

కథేంటంటే..

1990ల నేపథ్యంలో, కులం, వర్గం, విషపూరిత పురుషాధిక్యత, హింస రాజ్యమేలే ఒక గ్రామంలో ఈ కథ జరుగుతుంది. కార్తి (రిషికాంత్), సుబ్బు (సనంత్) చిన్నప్పటి నుంచే ప్రాణ స్నేహితులు. మద్యం తాగడం, గొడవలు పడటం, అడల్ట్ సినిమాలు చూడటం, తమకు ఇష్టమైన ఆహారం తినడం, స్నేహితులతో కలిసి ఏమీ చేయకుండా సమయం గడపడం వంటివి చేస్తూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. సుబ్బు తల్లి, చెల్లి ఇద్దరూ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. దీంతో కార్తి తల్లినే తన తల్లిగా భావిస్తూ ఉంటాడు. బలవంతుడు బలహీనుడిని తొక్కేటువంటి సమాజంలో అప్పటి పురుషుల ప్రతిరూపాలుగానే ఆ ఇద్దరూ పెరుగుతారు. అయితే సుబ్బు ఇంట్లోకి అతని అన్న భార్యగా మలయాళీ అయిన డోరతీ (కీర్తి సురేష్) అడుగుపెడుతుంది. ఆమెకు సుబ్బు చాలా దగ్గరవుతాడు. ఆ తరువాత సుబ్బు ఇంట్లో ఒక అనుకోని ఘటన జరుగుతుంది. అదేంటి? ఆ తరువాత సుబ్బు జీవితంలో వచ్చిన మార్పులేంటి? కార్తిని ఎందుకు సుబ్బుని చంపమని స్వయంగా అతని కుటుంబ సభ్యులే చెబుతారు? చివరకు ఈ కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Dorothy Review

సినిమా ఎలా ఉందంటే..

కార్తిక్ సుబ్బరాజ్ సమకాలీన, సామాజిక అంశాలతోనే సినిమాలను రూపొందిస్తుంటారు. ‘డోరతీ’ కూడా ఆ కోవకు చెందినదే. లింగ వివక్షను ప్రధానాంశంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకుడి ఉద్దేశం మంచిదే అని చెప్పాలి. కానీ జనాలను ఆకట్టుకోవాలి కదా. పురుషాధిక్యతను స్పష్టంగా చూపించారు. ఎమోషన్స్ అనేవి స్త్రీ పురుషులకు సమానంగా ఉంటాయని ఈ చిత్రం చెబుతోంది. మగవాళ్లకు సైతం ఏడ్చే స్వేచ్ఛ ఉంటుందని ఈ సినిమాలో చెప్పడం జరిగింది. కీర్తి సురేష్‌‌ను కాస్త ఎక్కువగా వినియోగించుకుంటే బాగుండేదని అనిపిస్తుంది. ఈ సినిమా తమిళ ప్రేక్షకుల మాటేమో కానీ తెలుగు ప్రేక్షకులకు ఎక్కడం చాలా కష్టం. ట్రాన్స్ జెండర్స్‌కు మద్దతు ఇస్తూనే.. డోరతీ ఆ సమాజానికి సంబంధించిన దాదాపు అన్ని మూస ధోరణులను వినియోగించుకోవడం అనేది సినిమాకు ప్రధాన సమస్యగా మారింది. పోనీ ట్రాన్స్‌జెండర్స్‌కు ప్రాధాన్యతనిచ్చారా? అంటే చివరి వరకూ అది జరగలేదు. ఈ చిత్రంలో అతి పెద్ద మైనస్.. సుబ్బు పాత్రతో కార్తికి మగాడు ఇలా ఉండాలి.. అలా ఉండాలని దర్శకుడు చెప్పించాడు. చివరకు సుబ్బు పాత్రతోనే స్త్రీత్వం గొప్పదనాన్ని కార్తికి అర్థమయ్యేలా చెప్పించాడు. మొత్తానికి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించడం కష్టమే.

Dorothy Review

ఎవరెలా నటించారంటే..

సుబ్బు పాత్రలో సనంత్ అద్భుతంగా నటించాడు. ఈ పాత్రకు అంగీకరించడమే గొప్ప విషయం. పైగా ఈ పాత్రలోని రెండు వేరియేషన్స్‌లోనూ చక్కగా నటించాడు. ఇక రిషికాంత్ కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు. కీర్తి సురేష్ పాత్ర నిడివి తక్కువే అయినా కూడా సినిమాకు ఆమే కీలకం. కనిపించినంత వరకూ అద్భుతంగా నటించింది. మిగిలిన పాత్రలన్నీ తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

కార్తిక్ సుబ్బరాజ్ తన పేరులోని కార్తి, సుబ్బులను హీరోలకు పెట్టాడు. అయితే అనుకున్న కథను చెప్పే క్రమంలో కాస్త తడబడ్డారు. సినిమాపై ప్రేక్షకుడు ఆసక్తిని కనబరిచలేని పరిస్థితి. సినిమా చాలా సాగదీతగా అనిపిస్తుంది. మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.

ఫైనల్‌గా.. ‘డోరతీ’ ప్రేక్షకులను మెప్పించడం కష్టమే.

Rating: (2.5/5)

మరిన్ని వార్తలు

No categories found.