Download App
Movie Poster

Sigma

Cast: Sundeep Kishan, Faria Abdullah, Raju Sundaram, Sampath Raj, Shiv Pandit, Anbu Thasan, Yog Japee, Magalakshmi, Sheela Rajkumar, Kamalesh, Kiran Konda

Director: Jason Sanjay

Music Director: Thaman S

Producer: Subaskaran

Banner: Lyca Productions

Release Date: October 2, 2026

సిగ్మా మూవీ రివ్యూ

Published అక్టోబర్ 2, 2026 by Srinivas

ప్రముఖ నటుడు, సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘సిగ్మా’. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ కూడా అంచనాలను పెంచేశాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? తెలుసుకుందాం.

సిగ్మా Telugu Review

కథేంటంటే..

తమ పూర్వీకుల ఇంట్లో లైబ్రరీ నడిపే గురు (సందీప్ కిషన్).. అప్పుల్లో కూరుకుపోయి ఉంటాడు. మరోవైపు వీరయ్య రెడ్డి (సంపత్ రాజ్) అనే స్మగ్లర్ తన వద్ద రూ.1,000 కోట్లతో కూడిన ఓ వాల్ట్‌ను కలిగి ఉంటాడు. ఆ వాల్ట్‌కు రెండు తాళం చెవులు మాత్రమే ఉంటాయి. ఒకటి వీరయ్య దగ్గర, మరొకటి ఎజిల్ (కిరణ్) అనే డ్రగ్ పెడ్లర్ దగ్గర ఉంటుంది. థియేటర్ పేరిట క్యాసినో నడిపే విన్సెంట్ (శివ్ పండిట్).. అదే ప్రదేశాన్ని ఎజిల్ డ్రగ్స్ సప్లై సెంటర్‌గా కూడా వినియోగించుకుంటూ ఉంటాడు. మరోవైపు గురు తన తల్లి జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న లైబ్రరీని కాపాడుకోవడానికి డబ్బు సంపాదించాలని చూస్తుంటాడు. ఈ క్రమంలోనే విన్సెంట్ నడుపుతున్న క్యాసినోలోకి వెళతాడు. ఆ తరువాత అతడి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ మలుపు ఏంటి? ఈ కథలో ఆర్జే సామ్ పాత్ర ఏమిటి? ఈ సినిమాలో రూ.500 కోట్ల మాఫియా డబ్బు, ఓ పెన్‌డ్రైవ్ లేదంటే కీ, దాన్ని దక్కించుకోవాలని ప్రయత్నించే గ్యాంగులు ఎవరు? ట్రెజర్ హంట్, హీస్ట్, యాక్షన్, కామెడీ అంశాలను జేసన్ సంజయ్ ఎలా కలిపారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే…

తెలివితక్కువ వ్యక్తుల గ్రూప్… కోట్ల రూపాయల డబ్బు. ఒక పెన్‌డ్రైవ్ లేదంటే తాళం చెవి కోసం ఆత్రంగా వెతికే విలన్. ఏదైనా జరిగిపోయిన తర్వాతే సంఘటనా స్థలానికి చేరుకునే పోలీసులు, దర్యాప్తు అధికారులు.. వంటి ఎన్నో హీస్ట్ డ్రామాలు ఇప్పటికే వెండితెరను అలంకరించాయి. జేసన్ విజయ్ కూడా ఈ తరహా హీస్ట్ డ్రామాతో ‘సిగ్మా’ను తెరకెక్కించారు. 25 ఏళ్ల జేసన్ తన తొలి చిత్రంగా అనేక ఉప కథలతో కూడిన హీస్ట్ డ్రామాను ఎంచుకున్నాడు. ఓ కీలక సందర్భంలో ఆ కథలన్నింటినీ కలిపే ప్రయత్నమైతే చేశాడు కానీ మొత్తంగా చూస్తే ఓల్డ్ స్టోరీలా అనిపిస్తుంది. యంగ్ డైరెక్టర్ కాబట్టి సరికొత్త ఆలోచనలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడని ఆశించిన వారికి ఈ సినిమా నిరాశను మిగులుస్తుంది. సిగ్మా కోసం ఎంచుకున్న సబ్ ప్లాట్స్ అన్నీ కూడా ఓల్డ్ ఐడియాసే. హీస్ట్, డ్రామా.. ఈ రెండు అంశాలకూ సినిమా సరిగా న్యాయం చేయదు. సినిమా ప్రారంభంలోనే దర్శకుడు ఎన్నో పాత్రలను పరిచయం చేవారు కానీ ఏ ఒక్క పాత్రనూ ఆకట్టుకునేలా మలచలేకపోయారు. హీరోకి మంచి ఎలివేషన్ ఇచ్చే సన్నివేశమే సినిమాలో కనిపించదు. స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉంది. కనీసం యాక్షన్ సన్నివేశాలను సైతం ఆసక్తికరంగా మలచలేకపోయారు. ఆటోమేటెడ్ కార్ పార్కింగ్ సిస్టమ్‌లో ఫైట్ సీక్వెన్స్‌ ఉంటుంది. దానిని సరిగ్గా తెరకెక్కించి ఉంటే సినిమాకే హైలైట్‌గా నిలిచేది. కానీ అది కూడా పట్టుతప్పింది. అక్కడ హీరో గురు కంటే అతని సైడ్‌కిక్ (అన్బు థాసన్) ఎక్కువగా ఫైట్ చేస్తుంటాడు. చివరకు గురు రంగంలోకి దిగే సమయానికి ప్రేక్షకులకు విసుగు వచ్చేస్తుంది. సినిమా మొత్తం డబ్బుతో నిండిన వాల్ట్ గురించి చెప్పడం జరిగింది కానీ అంత డబ్బు అవసరమున్న హీరో, అతని స్నేహితులు ఆ వాల్ట్‌ను దోచుకునేందుకు సీరియస్ ప్రయత్నమే కనిపించదు. ఫైనల్‌గా హీస్ట్ ప్లానింగ్ కూడా అత్యంత పేలవంగా ఉంటుంది.

ఎవరెలా నటించారంటే..

గురుగా సందీప్ కిషన్ అద్భుతంగా నటించాడు. అయితే అతని పాత్రను మరింత స్ట్రాంగ్‌గా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. ఆర్జే సామ్‌గా ఫరియా కూడా చాలా బాగా నటించింది. విన్సెంట్‌గా శివపండిట్ కూడా బాగానే నటించారు. సంపత్ రాజ్, అన్బు థాసన్, యోగ్ జాపీ, మగలక్ష్మి, షీలా రాజ్‌కుమార్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు జేసన్ సంజయ్ కథను మరింత స్ట్రాంగ్‌గా రాసుుకుని ఉంటే బాగుండేది. మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ పరంగా సినిమా బాగానే ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి.

ఫైనల్‌గా.. ‘సిగ్మా’ ఒక హీస్ట్ సినిమా… కానీ ఏమాత్రం ఉత్కంఠ రేకెత్తించదు.

Rating: (2/5)

మరిన్ని వార్తలు

No categories found.