Download App
Movie Poster

Ramani Kalyanam

Cast: Surya Vasishta, Deepshika Chandran, Srinivasa Reddy, Anchor Shyamala

Director: Vijay Adireddy

Music Director: Suraj S. Kurup

Producer: Vijay Adireddy, Manoj Chinthireddy, Srinath Pasupuleti, Sanjay Vemparala

Release Date: May 22, 2026

రమణి కల్యాణం మూవీ రివ్యూ

Published మే 22, 2026 by Srinivas

‘రమణి కల్యాణం’ టైటిల్ వినగానే.. ఇటీవలి కాలంలో కొన్ని టైటిల్స్ చూసిన మీదట ఎంత రమణీయంగా ఉందో అనిపించక మానదు. ఇక సినిమా విషయానికి వస్తే.. ట్రైలర్ చూసిన వారికి నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయి మధ్య ప్రేమకథ అనే విషయం అర్థమవుతుంది. మరి వీరి కథ కల్యాణం వరకూ ఎలా వెళ్లిందనేది చిత్ర కథ. మరి అది ప్రేక్షకులను ఆకట్టుకుందా? తెలుసుకుందాం.

Ramani Kalyanam Review

కథేంటంటే..

సంజన(దీప్షిక) చిన్నప్పుడే ఓ యాక్సిడెంట్‌లో కళ్లు పోగొట్టుకుంటుంది. అయినా కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది. తన పనులు తనే చేసుకుంటూ అందరితో కలివిడిగా ఉంటుంది. రేడియో జాకీ, సింగర్‌గా నలుగురు పిల్లలు, ఓ బామ్మతో హాయిగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది. సంజన పనిచేసే పబ్ ఓనర్ కిషోర్(శ్రీనివాసరెడ్డి) ఫ్రెండ్ రాజ్(సూర్య వసిష్ఠ) పెరాలసిస్ కారణంగా వీల్ చైర్‌కే అంకితమవుతాడు. సంజన, రాజ్‌లు పబ్‌లో ఓ గొడవలో భాగంగా కలుస్తారు. ఆ తరువాత స్నేహితులుగా మారి ప్రేమలో పడతారు. ఇద్దరివీ భిన్న మనస్తత్వాలు. తన గతాన్ని, గోల్‌ను గుర్తు చేసుకుంటూ రాజ్ బాధపడుతుంటే.. అందుకు భిన్నంగా సంజన ఆత్మవిశ్వాసంతో ఒక పాజిటివ్ మోడ్‌తో ముందుకు వెళుతూ ఉంటుంది. సంజన ప్రేమతో రాజ్ కూడా పూర్తిగా మారిపోతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ సమయంలో కిషోర్‌కి రాజ్ గురించి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. దాని కారణంగా కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అసలు రాజ్ వీల్ చైర్‌కు పరిమితమవడానికి కారణమేంటి? సంజన – రాజ్‌లు పెళ్లి పీటలెక్కారా? సంజనతో ఉండే పిల్లలు ఎవరు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Ramani Kalyanam Review

ఎలా ఉందంటే..

హీరో, హీరోయిన్లకు అనారోగ్య సమస్యలుండటం వంటి కథలు గతంలోనూ కొన్ని వచ్చాయి. కానీ ఈ సినిమాను మరే సినిమాతోనూ పోల్చలేం. ‘మనలోని ఏ లోపం కూడా జీవితంలో ముందుకు వెళ్లడానికి అడ్డంకిగా మారకూడదు’ అనే అంశంతో రూపొందిన కథ ఇది. వాస్తవానికి తీసుకున్న పాయింట్ అద్భుతమే. దానిని ప్రెజెంట్ చేసిన తీరే దారుణం. తొలి అర్థభాగమంతా హీరో, హీరోయిన్స్ పాత్రల పరిచయం, వారి స్నేహం, ప్రేమ వంటి అంశాలతో రూపొందింది. ఫస్ట్ హాఫ్ అంతా సాగదీతలా విసుగు పుట్టిస్తుంది. ఇక్కడికే ప్రేక్షకుడికి ఈ సినిమా చూడటం పెద్ద టాస్క్‌లా మారిపోతుంది. ఇక సెకండ్ హాఫ్‌లో హీరోహీరోయిన్ల పెళ్లి జరుగుతుందా? లేదా? అనే అంశంపైనే దర్శకుడు ముందుకు నడిపించారు. అసలు నలుగురు పిల్లలు, బామ్మ గురించి క్లారిటీ ఇవ్వకపోవడం మరో పెద్ద మైనస్. ఇక స్క్రీన్‌ప్లే కూడా మరో పెద్ద మైనస్ అని చెప్పాలి. ఏదో రొటీన్ ఫార్మాట్‌లో నడిపించేశారు. ఎండింగ్‌లో ఎమోషన్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే. టైటిల్ ఎంత గొప్పగా ఉందో.. సినిమా అంత రివర్స్‌లో ఉంది. కనీసం కామెడీ కాస్త వర్కవుట్ అయినా కూడా బాగుండేదేమో.. ముఖ్యంగా టైటిల్‌కు తగ్గట్టుగానే హీరోయిన్‌కు ప్రయారిటీ ఇచ్చిన దర్శకుడు.. టైటిల్ జస్టిఫికేషన్ మాత్రం సరిగా ఇవ్వలేకపోయారు. కొన్ని పాత్రలైతే ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. మొత్తమ్మీద హీరో ఫ్లాష్ బ్యాక్, ప్రి క్లైమాక్స్ ట్విస్ట్ కాస్త పర్వాలేదనిపిస్తాయి. అంతకు మించి సినిమా ఏమాత్రం ఆకట్టుకోదు.

Ramani Kalyanam Review

ఎవరెలా చేశారంటే..

దీప్షిక చంద్రన్ కళ్ళు లేని అమ్మాయిలా తన నటనతో మెప్పించింద. సూర్య వశిష్ట కూడా తన పాత్రకు సరిగ్గా సెట్ అయ్యారు. వీరిద్దరూ తమ నటనతో చక్కగానే నటించాడు. ఇక శ్రీనివాసరెడ్డి గురించి చెప్పేదేముంది? ఎప్పుడూ నవ్వించే శ్రీనివాసరెడ్డి ఈ సారి ఎమోషనల్ పాత్రలో నటించి మెప్పించాడు. లోహిత్ కుమార్, ప్రభావతి, చైతన్య జొన్నలగడ్డ, శ్యామల తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు ఒక మోటివేషనల్ కథ అయితే రాసుకున్నాడు కానీ దాన్ని ప్రెజెంట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఎమోషన్ ఏమాత్రం పండించలేకపోయారు. విజువల్ పరంగా సినిమా బాగుంది. ఇక పాటలు ఏమాత్రం మెప్పించవు. ఎడిటింగ్ విషయంలో కత్తెరకు మరింత పని చెప్పి ఉంటే బాగుండేదేమో. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగానే ఉన్నాయి.

ఫైనల్‌గా.. మెప్పించలేకపోయిన ‘రమణి కల్యాణం’

Rating: (1.5/5)

మరిన్ని వార్తలు

No categories found.