Download App
Movie Poster

Ari

Cast: Sai Kumar, Anasuya Bharadwaj, Subhalekha Sudhakar, Viva Harsha, Srikanth Iyengar, Srinivasa Reddy, Surya Purimetla, Vinod Varma

Director: V Jayashankar

Music Director: Anup Rubens

Producer: Srinivas Ramireddy, Seshu Maram Reddy, Dr Timmappa Naidu Purimetla, B Sudhakar Reddy

Banner: ARVY Cinemas

Release Date: October 10, 2025

అరి మూవీ రివ్యూ

Published అక్టోబర్ 10, 2025 by Srinivas

Ari Review: ఆరుగురి బలహీనత… కృష్ణ పరమాత్ముని లీల!

పేపర్ బాయ్ చిత్ర దర్శకుడు జయశంకర్ తీసిన తాజా చిత్రం ‘అరి: మై నేమ్ ఈజ్ నో బడీ’. అరిషడ్వర్గాల కథాంశంతో తీసిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి.

డైలాగ్ కింగ్ సాయి కుమార్, ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘అరి: మై నేమ్ ఈజ్ నో బడీ’. వినోద్ వర్మ కథానాయకుడిగా నటించారు. సురభి ప్రభావతి శుభలేఖ సుధాకర్ వైవా హర్ష ఇతర ప్రధాన తారాగణం. పేపర్ బాయ్ తర్వాత జయశంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. అరిషడ్వర్గాల కథాంశం తీసుకొని సినిమా చేశారు. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి.

Ari Review: ఆరుగురి బలహీనత… కృష్ణ పరమాత్ముని లీల!

కథ:

చైతన్య (శ్రీకాంత్ అయ్యంగార్) సీఐ. హైదరాబాద్ సిటీలో జరిగిన బ్యాంకు దోపిడీ, ఏటీఎం రాబరీ కేసులను ఛేదించే పనిలో పడ్డాడు. పోలీసుగా ఉద్యోగం చేస్తున్న అతను ఓ నిధి అన్వేషణలో ఎటువంటి పరిచయం లేని వ్యక్తిని రక్తం వచ్చేలా కొట్టడానికి రెడీ అవుతాడు. మరణించిన భర్త మళ్లీ బ్రతుకుతాడని చెబితే పాతిక మందికి పైగా ప్రాణాలు తీసే బాంబు బ్లాస్ట్‌కు పథకం రచిస్తుంది లక్ష్మి (సురభి ప్రభావతి). ఆస్తి కోసం 60 ఏళ్ల వయసులో కుమార్తెలాంటి అమ్మాయిని మానభంగం చేయడానికి సిద్ధమవుతాడు గుంజన్ (శుభలేఖ సుధాకర్). సన్నీలియోన్‌తో ఒక్కరాత్రి పడక సుఖం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమవుతాడు అమూల్ కుమార్ (వైవా హర్ష). తాను ట్రైనింగ్ ఇచ్చిన అమ్మాయి తన కంట ఉన్నత స్థాయికి వెళ్లడం తట్టుకోలేని ఆత్రేయి (అనసూయ) యాసిడ్ దాడికి రెడీ అవుతుంది. వేలకోట్ల సంపద ఉన్న విప్రనారాయణ పాశ్వాన్ (సాయి కుమార్)ది మరొకథ. దానం చేయడానికి అతనికి చెయ్యి రాదు. ఈ ఆరుగురు తమ కోర్కెలు తీరడానికి లైబ్రరీలో ఉన్న వ్యక్తి (వినోద్ వర్మ) దగ్గరకు వెళ్తారు. వాళ్లకు అతను ఇచ్చిన టాస్కులు ఏమిటి? చివరకు జరిగిందేమిటి? అనేది సినిమా.

Ari Review

విశ్లేషణ:

అరిషడ్వర్గాలు అనడం, వినడం తప్ప సాధారణ ప్రజలకు వాటి గురించి తెలిసింది తక్కువ. ప్రతి ఒక్కరిలో అరిషడ్వర్గాలు ఎలా ఉంటాయనేది ‘అరి’లో విపులంగా వివరించారు దర్శకుడు జయశంకర్‌. అయితే అరిషడ్వర్గాలు (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు) గురించి చక్కగా చెప్పిన ఆయన వాటి వల్ల వచ్చే ప్రమాదాలను అంతే ప్రభావవంతంగా తెరపై ఆవిష్కరించడంలో విఫలమయ్యారు.

సన్నీ లియోన్ అంటే పడిచచ్చే యువకుడు, ఆమెతో ఒక్కరోజు పడక సుఖం లభిస్తుందని చెబితే సెక్స్ టాయ్స్ అమ్మడానికి సైతం అస్సలు వెనుకాడడు. అందువల్ల అతడికి ఎటువంటి ప్రమాదం ఎదురైందనేది ప్రారంభంలో వినోదాత్మకంగా చూపించారు. అందువల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆ ఒక్క కథలో మాత్రమే కాదు… మిగతా కథల్లోనూ కాన్ ఫ్లిక్ట్ సరిగా ఎలివేట్ కాలేదు. మెయిన్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్‌గా రాసుకున్నా వాళ్ళ ఎమోషన్స్ సరిగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఎంతో ఆసక్తికరంగా మొదలైన సినిమా తర్వాత మెల్లమెల్లగా ఆసక్తి సన్నగిల్లుతుంది. కాన్సెప్ట్ బావుంది కానీ స్క్రీన్ మీదకు తీసుకు వచ్చిన తీరులో జయశంకర్ తడబడ్డాడు.

Ari Review: ఆరుగురి బలహీనత… కృష్ణ పరమాత్ముని లీల!

స్టోరీ పరంగా ‘అరి’లో విషయం ఉంది. కానీ టెక్నికల్ పరంగా ఈ మూవీ వీక్. కెమెరా వర్క్ ఓకే. కానీ ఎడిటింగ్ & మ్యూజిక్ అసలు బాలేదు. స్క్రీన్ ప్లే సైతం కనెక్ట్ అయ్యేలా లేదు. బడ్జెట్ పరిమితులు చాలా స్పష్టంగా తెరపై కనిపించాయి. సాయి కుమార్ నుంచి మొదలు పెడితే అనసూయ, వైవా హర్ష, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి వరకు ప్రతి ఒక్కరూ టాలెంటెడ్ ఆర్టిస్టులు. అందరూ బాగా చేశారు. సుమన్, ఆమని అతిథి పాత్రల్లో తళుక్కున మెరిశారు.

తీర్పు:

దర్శకుడు జయశంకర్ ఎంపిక చేసుకున్న కథలో విషయం ఉంది. ఈ సినిమాలో ఆయన చెప్పాలనుకున్న కథలో ఆలోచన బావుంది. కానీ ఆ కథను ప్రారంభం నుంచి ముగింపు వరకు అంతే ఆసక్తిగా చెప్పడంలో కాస్త తడబడ్డాడు. ఆలోచన బావుంది కానీ ఆచరణలో అసలు విషయం పూర్తిగా ఆవిష్కరించలేదు. ఆరుగురి బలహీనతలను శ్రీకృష్ణ పరమాత్మ లీల ఏ విధంగా మార్చింది అనేది సినిమా. కృష్ణ తత్వం ఇంకాస్త బలంగా ఆవిష్కరించాల్సి ఉంది.

Rating: (2.5/5)

మరిన్ని వార్తలు

No categories found.