హుషారు పిట్టలు మూవీ రివ్యూ
Published ఆగస్ట్ 18, 2026 by Srinivas
టీనేజ్ ఆరంభంలో పిల్లల్లో అప్పుడప్పుడే ఆకర్షణ మొదలవుతూ ఉంటుంది. అది చివరకు ఎలా టర్న్ అవుతుంది? కన్నవాళ్లు.. ప్రేమించిన వాళ్లు ఎవరి వైపు టర్న్ అవుతారు? వారి జీవితాలు ఏమవుతాయి? వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వంటి ఆసక్తికర అంశాలతో రూపొందినదే ‘హుషారు పిట్టలు’. ఇప్పటి వరకూ విడుదలైన అప్‌డేట్స్ చూస్తుంటే వాస్తవ జీవితానికి చాలా అనుబంధంగా ఉన్నట్టుగా అనిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి సినిమా అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.

కథేంటంటే..
ఓ గ్రామంలో చిట్టి (వాసవి గణేషన్) మెచ్యూర్ అయిన నాటి నుంచి ఆమెలో అబ్బాయిల పట్ల ఆకర్షణ ప్రారంభమవుతుంది. మరోవైపు రవి (అన్ష్) టెన్త్ టాపర్. చదువు తప్ప వేరే ప్రపంచం తెలియని పిల్లాడు. అలాంటి వాడిని ఎలాగైనా చెడగొట్టాలని కంకణం కట్టుకున్న అతని స్నేహితులు కొన్ని అశ్లీల వీడియోలు చూపిస్తారు. రవి ఆ వీడియోల పట్ల ఆకర్షితుడవుతాడు. ఆ తరువాత రవిపై చిట్టికి ఆకర్షణ కలుగుతుంది. చిట్టి అన్న బాలునే రవికి ప్రేమ పాఠాలు చెబుతూ ఉంటాడు. చివరకు బాలు చెప్పిన ప్రేమ పాఠాలనే అతని చెల్లి చిట్టి దగ్గరే ప్రయోగిస్తాడు. అలా ఓ సందర్భంలో వాళ్లిద్దరూ ఒకటవుతారు. అక్కడి నుంచి తరచూ వాళ్లిద్దరూ కలుస్తూ ఉంటారు. ఈ విషయం పెద్దవాళ్లకు తెలుస్తుంది. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? చిట్టి, రవి ప్రేమను పెద్దలు అంగీకరించారా? రవి, చిట్టి ఏకమయ్యారా? టీనేజ్ ప్రేమ.. పెళ్లికి దారి తీసిందా? వారి ప్రేమ వ్యవహారం పెద్దవారికి ఎలాంటి ఇబ్బందులను తెచ్చిపెట్టింది? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
సినిమాలో అంతా కొత్తవారే. అయితే ప్రస్తుతం సినిమాకు బాగా తెలిసిన ఆర్టిస్టులతో పని లేదు. కంటెంట్ స్ట్రాంగ్ ఉండాలి. సినిమాను ప్రమోషన్స్‌తో జనాల్లోకి తీసుకెళ్లాలి. వన్స్ బాగుందన్న టాక్ వస్తే చాలు.. మౌత్ టాక్ బలమైన పబ్లిసిటీగా మారిపోయి సినిమాకు బీభత్సమైన క్రేజ్‌ను తీసుకొచ్చేస్తుంది. ఇక ‘హుషారు పిట్టలు’ సినిమా విషయానికి వస్తే.. టీనేజ్ యూత్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి మెచ్యూర్ అవగానే ఆమెలో సెక్సువల్‌గా ఎలాంటి మార్పులొస్తాయి. మగపిల్లల పట్ల ఎలా ఆకర్షితులవుతారు? పిల్లల పెంపకం విషయం పెద్దల చేజారితే.. ఎలాంటి అనర్ధాలకు దారి తీస్తుందనే పాయింట్ చుట్టూ అల్లిన కథ. వాస్తవానికి సమాజంలో జరుగుతోంది కూడా ఇదే. అయితే ఒక జెన్‌జీ కామెడీతో సినిమాను రూపొందించారు. ముఖ్యంగా ఒక ఆడపిల్ల, ఆమె కుటుంబాన్ని బేస్ చేసుకుని తీసిన చిత్రమిది. ఆడపిల్ల దారి తప్పితే ఆమె కుటుంబం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది? అలాగే ఆమె కొంతకాలం తర్వాత తన స్నేహితులతో సఖ్యంగా మనగలుగుతుందా? వంటి పాయింట్స్‌ను ఈ చిత్రంలో హైలైట్ చేశారు. బాగా చదివే యువకుడిని కొన్ని సందర్భాల్లో స్నేహితులే ఎలా చెడగొడతారు. లేనిపోని ఆకర్షణలకు లోనైతే చివరకు ఆ పిల్లవాడి పరిస్థితి ఏమవుతుందనేది కూడా చిత్రంలో చూపించారు. మొత్తంగా ఈ చిత్రం టీనేజ్ పిల్లలు, వారి తల్లిదండ్రులను టార్గెట్‌గా చేసుకుని తీశారు. అయితే ఫస్ట్ హాఫ్ చూస్తున్న వారికి ‘చిత్రం’ సినిమా గుర్తొస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడటం ఇబ్బందే. ఒక మెసేజ్ ఇవ్వటానికి దాని చుట్టూ అల్లిన కథ దారుణంగా ఉంది. పెద్దవాళ్లకైతే నచ్చదు. జెన్‌జీ ఎంజాయ్ చేయవచ్చు. కానీ 16 ఏళ్ల పైబడిన పిల్లలు మాత్రమే చూడాలి. సెన్సార్ రిపోర్ట్ కూడా ఇదే ఇచ్చింది.

ఎవరెలా నటించారంటే..
వాసవి గణేశన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తన పాత్రలో జీవించేసింది. ఎక్కడా తడబడకుండా ప్రతి సన్నివేశంలోనూ అద్భుతమైన నటనను కనబరించింది. వాసవి గణేశన్‌ను చూస్తుంటే ‘కొత్త బంగారులోకం’ చిత్రంలో శ్వేతా బసు ప్రసాద్ గుర్తొస్తుంది. అన్షు కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు. గోవర్ధన్, సునీత మనోహర్, రమేష్, అంజి వల్గుమాన్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు భిక్షు ఎంచుకున్నది వినూత్న కథేమీ కాదు. గతంలోనూ ఇలాంటి కథను చూశాం. కానీ కొన్ని సన్నివేశాల్లో బోల్డ్‌నెస్ కనిపిస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూసేవారికి కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇక చరణ్ అర్జున్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్. ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఎడిటింగ్‌పై దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.
ఫైనల్‌గా.. ‘హుషారు పిట్టలు’ జెన్‌జీకి మాత్రమే కనెక్ట్ అవుతుంది.
Rating: 



(2/5)
