Download App
Movie Poster

Maa Inti Bangaaram

Cast: Samantha Ruth Prabhu, Diganth Manchale, Gauthami, Chaitanya, Srinivas Gavireddy

Director: BV Nandini Reddy

Music Director: Santhosh Narayanan

Producer: Tralala Moving Pictures

Banner: Tralala Moving Pictures

Release Date: June 19, 2026

మా ఇంటి బంగారం మూవీ రివ్యూ

Published జూన్ 19, 2026 by Srinivas

చాలా కాలం పాటు వెండితెరకు దూరంగా ఉన్న సమంత తాజాగా ‘మా ఇంటి బంగారం’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నందినీరెడ్డితో కలిసి చేసిన ‘ఓ బేబీ’ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. తిరిగి ఈ కాంబో ఇన్నాళ్లకు రిపీట్ అయ్యింది. ఇప్పటికే పాటలు, ఇతర అప్‌డేట్స్ అయితే సినిమాపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా సమంత యాక్షన్ సన్నివేశాలు అప్‌డేట్స్‌లో భాగంగా రావడం వంటి అంశాలు ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. మరి సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం.

Maa Inti Bangaaram Movie Review

కథేంటంటే..

చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో స్వర్ణ (సమంత) ఓ అనాథాశ్రమం.. అక్కడి నుంచి బయటకు వచ్చి చాలా కష్టాలు పడుతుంది. ఓ పెద్దింటి అబ్బాయి అనిరుధ్‌ (దిగంత్ మంచాలే)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని అనిరుధ్‌ని అతని కుటుంబం దూరం పెడుతుంది. తన కారణంగా అనిరుధ్‌కి తన కుటుంబం దూరమైంది కాబట్టి మళ్లీ అతడిని కుటుంబానికి దగ్గర చేయాలన అనుకుంటుంది. ఇంతలో ఆ ఇంట్లో ఓ శుభకార్యం రావడంతో.. అత్తారింటికి భర్తతో కలిసి వెళుతుంది. ఆ ఇంటి ఆచారాలు, కట్టుబాట్లు తెలుసుకుని దానికి తగినట్టుగా ఉంటూ అందరి ఆదరాభిమానాలను సంపాదిస్తుంది. ఇంతలోనే సమంతే ఝాన్సీ అంటూ కొందరు ఆమెను వెంటాడుతుంటారు. ఆమెను ఎలాగైనా చంపేయాని జైలులో ఉన్న కరుణ (గుల్షన్ దేవయ్య) జైలు నుంచి బయటకు వస్తాడు. అసలు కరుణ ఎవరు? ఝూన్సీకి అతనికి ఉన్న సంబంధం ఏమిటి? ఝాన్సీ.. స్వర్ణగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఆమె గతం ఏమిటన్న విషయాలను వెండితెరపై వీక్షించాల్సిందే.

Maa Inti Bangaaram Movie Review

ఎలా ఉందంటే..

అనాథ పిల్లలు.. ముఖ్యంగా అమ్మాయిలు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటారు. సమాజంలో చిన్న పిల్ల అయినా కూడా ఆడపిల్ల అయితే ఆమె పట్ల కొందరు మగవాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుందనేది చిత్రంలో స్పష్టంగా చూపించారు. వయసు పెరుగుతున్నా కొద్దీ కష్టాలు పెరుగుతాయే తప్ప తరగవు. కాస్త పెళ్లై ఒకింటిది అయితేనే ఆమెకు రక్షణ. ఈ అంశాలన్నింటినీ దర్శకురాలు నందినీ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. సినిమా ఆరంభం చాలా బాగుంది. చాలా ప్లెజెంట్‌గా ప్రారంభమవుతుంది. స్నేహితురాలితో కలిసి సమంత చేసే సందడి.. వారి అమాయకత్వం.. ఆ తరువాత సమంత, భర్తతో కలిసి అత్తవారింటికి వెళ్లడం.. అక్కడ కొన్ని సన్నివేశాలు చాలా హిలేరియస్‌గా అనిపిస్తాయి. ఇక ద్వితీయార్థానికి వచ్చేసరికి కథలో ఆసక్తి కొరవడింది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే. అయితే ఆ గతమేంటో అత్తవారింట తెలిస్తే ఏంటనే సన్నివేశాల్లో డ్రామా కూడ పెద్దగా పండలేదు. కానీ స్వర్ణ తన స్నేహితురాలితో కలిసి చేసే సందడి మాత్రం చాలా ఆకట్టుకుంటుంది. ప్రతినాయకుడిగా కరుణ బాగా సెట్ అయ్యారు కానీ ఆయనను వాడుకోవడంలో దర్శకురాలు ప్రతిభను కనబరచలేదనిపించింది.

Maa Inti Bangaaram Movie Review

ఎవరెలా చేశారంటే..

ఈ సినిమా విషయానికి వస్తే.. సమంత గురించి ముఖ్యంగా చెప్పాలి. ఆమె నటన హైలైట్ అని చెప్పాలి. యాక్షన్ సన్నివేశాల్లో సైతం సమంత చాలా బాగా చేసింది. ఇక సమంత తర్వాత చెప్పుకోవాల్సింది ఆమె స్నేహితురాలి గురించి. సమంత స్నేహితురాలిగా మంజూష ముక్కవిల్లి అద్భుతంగా నటించింది. ఆమె అమాయకత్వంతో చేసే హడావుడి చాలా హిలేరియస్‌గా అనిపిస్తుంది. ఇక కరుణ పాత్రలో గుల్షన్ దేవయ్య నటన బాగుంది. కానీ ఆయన పాత్రే అంత డెప్త్‌గా డిజైన్ చేయలేదు. ఆ పాత్రని డిజైన్ చేసిన తీరే సరిగ్గా లేదు. సమంత భర్తగా దిగంత్ బాగానే నటించారు. శ్రీముఖి, గౌతమి, శ్రీలక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, శ్రీలక్ష్మి తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

నందినీ రెడ్డి కథలోని కొన్ని సన్నివేశాలను మరింత డెప్త్‌గా రాసుకుని ఉంటే బాగుండేది. బలమైన సన్నివేశాలను సైతం సింపుల్‌గా తేల్చేశారు. అయితే హాస్య సన్నివేశాలను మాత్రం అద్భుతంగా తెరకెక్కించారు. మ్యాజిక్ విషయానికి సంతోష్ నారాయణన్ సంగీతానికి మంచి మార్కులే పడతాయి. నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి.

చివరిగా: మా ఇంటి బంగారం ప్రేక్షకులను కొంత మేర మాత్రమే అలరిస్తుంది.

Rating: (2.75/5)

మరిన్ని వార్తలు

No categories found.