Download App
Movie Poster

Memu Coplam

Cast: Nagababu, Getup Srinu, Raviteja Nannimala, Siri Parvathi, Ritu Chowdary, Charan Lakkajaru, Kireeti Damaraju

Director: Pradeep Maddali

Music Director: Saketh Komanduri

Producer: BVS Ravi

Release Date: May 22, 2026

మేము ‘కాప్’లం మూవీ రివ్యూ

Published మే 22, 2026 by Srinivas

ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లదే హవా. ప్రత్యేకంగా థియేటర్లకు వెళ్లాల్సిన పని లేదు. ఎక్కడంటే అక్కడ కూర్చొని చూసేయవచ్చు. పైగా వెబ్‌సిరీస్‌ల కంటెంట్ కూడా చాలా బాగుండటంతో ప్రేక్షకుల ఓటు సినిమాల కంటే వెబ్‌సిరీస్‌లకే ఎక్కువగా దక్కుతోంది. ఈ క్రమంలోనే తాజాగా జీ5లో ‘‘మేము ‘కాప్’లం’’ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. ఈ వెబ్‌సిరీస్ విషయంలో నడచిన కాంట్రవర్సీ కావొచ్చు.. మంచి ఎంటర్‌టైనింగ్ అని ముందుగానే టాక్ నడవడం వంటివి సిరీస్‌కు బాగా హైప్ ఇచ్చాయి. మరి ఆ హైప్‌ను వెబ్ సిరీస్ అందుకుందా? చూద్దాం.

Memu Copulam Webs series Review

కథేంటంటే..

మొత్తం ఆరు ఎపిసోడ్‌లతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. మ‌హాదేవ ప‌ట్నానికి గ‌జ‌ప‌తి రాజు (నాగ‌బాబు) చెప్పిందే వేదం… చేసిందే శాసనం. ఆయన మాటకు తిరుగుండదు. అలాంటి గజపతిరాజు తన పందెం కోడికి సలార్ రాజు అని పేరు పెట్టి తన వారసుడిగా ప్రకటిస్తాడు. అంతే… సలార్ రాజుఆ ఊరిలో సెలబ్రిటీ అయిపోతుంది. అంతా దానిని గౌరవంగా చూస్తారు. ఇక సంక్రాంతి కోడిపందేల్లోనూ సలార్ రాజుదే హవా. దానిని కొట్టే కోడే ఉండదు. ఓ ఏడాది సంక్రాంతి కోడిపందేలకు ముందు ఊరి వాళ్లందరికీ గజపతి రాజు పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో సలార్ రాజు మిస్సవుతాడు. సలార రాజును వెదికే బాధ్యతను గజపతి రాజు.. మహదేవపట్నం ఎస్ఐ రి సొటారి (రవితేజ నన్నిమల), కానిస్టేబుల్ మోహన్ సొటారి (గెటప్ శీను)కి అప్పగిస్తాడు. స‌లార్ రాజు మిస్సింగ్‌లో గ‌జ‌ప‌తిరాజు ప్ర‌త్య‌ర్థులైన మ‌హిపాల్ రెడ్డి, సుధాక‌ర్‌రెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని ర‌వి, మోహ‌న్ అనుమానిస్తారు. ఈ క్రమంలోనే మంచి కామెడీ వర్కవుట్ అవుతుంది. అసలు సలార్ రాజు ఏమయ్యాడు? మిస్సింగ్ కేసును రవి, మోహన్ ఛేదించారా? ఊరిలో చేతబడులు జరుగుతున్న మాట వాస్తవమేనా? దీని గుట్టును సైతం రవి, మోహన్ విప్పారా? సంఘ‌వి (సిరి పార్వ‌తి), ఆకాష్ రెడ్డి (చ‌ర‌ణ్ ల‌క్క‌రాజు)ల‌వ్‌స్టోరీ ఏమైంది? వంటి అంశాల గురించి తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో మేము “కాప్‌”లం వెబ్‌సిరీస్‌లో తొలి ఎపిసోడ్ గ‌జ‌ప‌తిరాజు, స‌లార్ రాజు పాత్రల ప‌రిచ‌యం, పందెం కోడి మిస్సింగ్ చుట్టూనే తిరుగుతుంది. ఆంధ్రాలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడిపందేలు విపరీతంగా నడుస్తుంటాయి. దీనికోసం కోళ్లను ప్రత్యేకంగా డ్రైఫ్రూట్స్ పెట్టి మరీ పెంచుతుంటారు. వీటిని చాలా ప్రత్యేకంగా చూసుకుంటారు. ఈ అంశాన్నే దర్శకుడు ప్రదీప్ మద్దాలి తీసుకుని ఆసక్తికరంగా రూపొందించారు. ‘బాహుబలి’ రేంజ్‌లో వారసుడిగా కోడిని ప్రకటించడం వంటి సీన్లను రూపొందించారు. ఇక కోడి కేసును ఛేదించేందుకు ర‌వి, మోహ‌న్ రంగంలోకి దిగిన‌ప్ప‌టి నుంచి సిరీస్ కామెడీ టర్న్ తీసుకుంటుంది. రవి, మోహన్ దొంగలను పట్టుకునేందుకు వేసిన స్కెచ్‌లు అట్టర్‌ఫ్లాఫ్ అవడం.. ఈక్రమంలోనే కామెడీ జెనరేట్ అవుతూ ఉంటుంది. కోడి మిస్సింగ్ కేసును పలువురిపైకి అనుమానాలను షిఫ్ట్ చేస్తూ ఆసక్తికరంగా ప్రదీప్ మద్దాలి నడిపించారు. చివరకు దొంగ ఎవరనే ట్విస్ట్‌ను సైతం ఫన్నీగానే చూపించారు. మరోవైపు కోడి మిస్సింగ్‌ను మాత్రమే కాకుండా చేతబడుల అంశాన్ని కూడా తీసుకుని ప్రేక్షకులకు మోనాటమీ రాకుండా చూసుకున్నారు. మొత్తంగా సిరీస్ మంచి ఎంటర్‌టైనింగ్‌గా ఉంది.

Memu Copulam Webs series Review

ఎవరెలా నటించారంటే..

గజపతిరాజు పాత్రలో నాగబాబు చాలా హూందాగానూ.. మంచి నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఎస్‌ఐగా రవితేజ నన్నిమాల చాలా బాగా ఎంటర్‌టైన్ చేశారు. అమాయకత్వంతో పాటు మంచితనం మూర్తీభవించిన వ్యక్తిగా రవితేజ నటించారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గెటప్ శ్రీను గురించి. తను ఏ పాత్రలో అయినా జీవించేస్తాడు. ఇక ఈ వెబ్‌సిరీస్‌లో హాయిగా నవ్విస్తూ సిరీస్‌కే హైలైట్‌గా నిలిచాడు. రవితేజ, గెటప్ శ్రీను ఇద్దరి కాంబినేషన్ సీన్లు హిలేరియస్‌గా ఉంటాయి. చ‌ర‌ణ్ ల‌క్క‌రాజు, సిరి పార్వ‌తి, రీతూ చౌదరి, కిరీటి దామరాజు వంటి వారు తమ నటనతో మెప్పించారు.

టెక్నికల్ పరంగా..

ప్రదీప్ మద్దాలి వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించిన తీరు చాలా బాగుంది. కోడిపందేలతో పాటు.. పందెంకోడిని ఏపీవాసులు ఎంత గొప్పగా చూస్తారనేది కూడా ఆసక్తికరంగా చూపించారు. అయితే మైనస్‌లు కూడా ఉన్నాయి. మంచి కమెడియన్స్ ఉన్నా కూడా అనుకున్న స్థాయిలో కామెడీని అయితే రాబట్టుకోలేకపోయారు. రవి, మోహన్ ఇన్వెస్టిగేషన్ సీన్లు అంతగా పండలేదు. ప్రేక్షకులకు రిపీట్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. కథ ఫాస్ట్‌గా ముందుకు కదులుతున్న ఫీలింగ్ అయితే రాదు. సంఘ‌వి, ఆకాష్ ల‌వ్‌స్టోరీతో పాటు మరికొన్ని సన్నివేశాలను బలవంతంగా కథలో జొప్పించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాల్లో ప్రదీప్ మద్దాలి జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. ఇక ఈ వెబ్‌సిరీస్ క్రెడిట్‌ను కొంతమేర శోభ‌న్ చిట్టిప్రోలుకు ఇవ్వాలి. కథ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లేలో సైతం ఆయన భాగమయ్యారు. మూడు బాధ్యతలను ఆయన చక్కగా నిర్వర్తించారు. మ్యూజిక్ విషయానికి వస్తే సాకేత్ కథకు తగ్గట్టుగా చక్కగా ఇచ్చారు. కోనసీమ అందాలను సినిమాటోగ్రాఫర్ అద్భుతంగా చూపించారు. నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి.

ఫైనల్‌గా.. ‘‘మేము ‘కాప్‌’లం’’ ఫ‌న్ క్రైమ్‌ థ్రిల్ల‌ర్ సిరీస్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

Rating: (3/5)

మరిన్ని వార్తలు

No categories found.