Download App
Movie Poster

Mithra Mandali

Cast: Priyadarshi, Niharika NM, Rag Mayur, Vishnu Oi, Prasad Behara

Director: Vijayendar S

Music Director: RR Dhruvan

Producer: Kalyan Manthina, Bhanu Pratapa, Dr. Vijender Reddy Teegala

Banner: Sapta Aswa Media Works, Vyra Entertainments

Release Date: October 16, 2025

మిత్ర మండలి మూవీ రివ్యూ

Published అక్టోబర్ 16, 2025 by Srinivas

మిత్ర మండలి రివ్యూ: సత్య నవ్వించాడు గానీ…

ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం జంటగా నటించిన ‘మిత్ర మండలి’ పెయిడ్ ప్రీమియర్ షోలతో విడుదలైంది. ‘జాతిరత్నాలు’ అనుదీప్ రూమ్మేట్ విజయేందర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి. 

మిత్ర మండలి రివ్యూ

కథ:

ప్రియదర్శి, ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక ఎన్ఎం జంటగా నటించిన కామెడీ సినిమా ‘మిత్ర మండలి’. ‘జాతిరత్నాలు’ అనుదీప్, ‘మ్యాడ్’ కళ్యాణ్ శంకర్, ’90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఆదిత్య హాసన్ రూమ్మేట్ విజయేందర్ ఎస్ దర్శకుడిగా పరిచయమైన చిత్రమిది. పెయిడ్ ప్రీమియర్ షోలతో అక్టోబర్ 15న థియేటర్లలో విడుదలైంది. అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ రిలీజ్. ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి. 
కథ: చైతన్య (ప్రియదర్శి), సాత్విక్ (విష్ణు ఓయ్), అభి (రాగ్ మయూర్), రాజీవ్ (ప్రసాద్ బెహ్రా) స్నేహితులు. స్వేచ్ఛ (నిహారిక ఎన్ఎం)ను చూసి సాత్విక్, అభి ప్రేమిస్తారు. అయితే ఆమె మాత్రం చైతన్యను ప్రేమిస్తుంది. చైతన్యను పెళ్లి చేసుకోవాలని ఇంటి నుంచి పారిపోయి వస్తుంది. 

స్వేచ్ఛ తండ్రి నారాయణ (వీటీవీ గణేష్) తుట్టె కుల పెద్ద. తన కుమార్తె కిడ్నాప్ అయ్యిందని పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. స్వేచ్ఛను వెతికే క్రమంలో ఏం తెలిసింది? చివరకు ఏం తేలింది? అనేది సినిమా.

Mithra Mandali Movie Review

విశ్లేషణ:

ప్రేక్షకులు మెచ్చినది హిట్ సినిమా. ప్రేక్షకులను నవ్వించినది కామెడీ సినిమా. ఇందులో మరొక మాటకు తావులేదు. కామెడీలో క్లీన్, క్రింజ్, స్లాప్ స్టిక్ వంటి పదాలు ప్రేక్షకులకు అనవసరం. తెరపై సన్నివేశాలు నవ్వించాయా? లేదా? అనేది మాత్రమే ముఖ్యం. నవ్వించడంలో ‘మిత్ర మండలి’ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు.

‘మిత్ర మండలి’ టీజర్, సాంగ్స్, ట్రైలర్ చూస్తే మరో ‘జాతి రత్నాలు’ అవుతుందనే నమ్మకం కలిగించాయి. కానీ స్క్రీన్ మీద మాత్రం ఆ రేంజ్ కామెడీ జనరేట్ కాలేదు. ‘జాతి రత్నాలు’ టైపులో నలుగురు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు, లవ్ ట్రాక్ రాశాడు డెబ్యూ డైరెక్టర్ విజయేందర్. కానీ అవి క్లిక్ కాలేదు. ముందు నుంచి చెప్పినట్టు మూవీలో కథ లేదు. దాంతో అటు కామెడీ లేక, ఇటు కథ లేక ప్రేక్షకులను థియేటర్లలోని సీట్లలో కూర్చోబెట్టడంలో ఫెయిల్ అయ్యింది.

మిత్ర మండలి రివ్యూ

‘మిత్ర మండలి’ దర్శక రచయిత విజయేందర్ ఆలోచనల్లో తప్పు లేదు. కానీ తెరపైకి ఆచరణలోకి ఆలోచనలు వస్తున్నాయో లేదో చూసుకోవడంలో సక్సెస్ కాలేదు. మ్యూజిక్ ఓకే. పాటల్లో ‘కత్తి అందుకో జానకి’ ఫన్నీగా ఉంది. ఆర్ఆర్ ధ్రువన్ అందించిన నేపథ్య సంగీతం బావుంది. ప్రొడక్షన్ వేల్యూస్ కథకు తగ్గట్టు ఉన్నాయి. కామెడీ ఫెయిల్ అయ్యాక టెక్నికల్ అంశాలు ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం!?

చైతన్య పాత్రలో ప్రియదర్శి నటన బావుంది. తన వరకు తప్పు లేకుండా చేశారు. ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో హీరోయిన్ నిహారిక ఎన్ఎం మాత్రం బోల్తా కొట్టారు. అసలు ఆవిడ లుక్స్ బాలేదు. రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహ్రా, వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్… ప్రతి ఒక్కరూ ప్రతిభావంతులే. కామెడీ కింగులే. కానీ ఒక్కరికీ పర్ఫెక్ట్ సీన్ పడలేదు. అందరిలో సత్య మాత్రం హైలైట్ అవుతాడు. కథ, సీన్ వంటి వాటితో సంబంధం లేకుండా కామెడీ టైమింగ్ తో నవ్వించాడు.

మిత్ర మండలి రివ్యూ

తీర్పు:

‘మిత్ర మండలి’ స్టార్టింగ్ సీనులో బ్యాట్, బాల్ లేకుండా క్రికెట్ ఆడతారు హీరో ప్రియదర్శి & గ్యాంగ్. క్రికెట్‌లో బాల్, బ్యాట్ లేకుండా ఆట ఎలా సాధ్యం? సేమ్ టు సేమ్… కామెడీ లేకుండా ఎంటర్‌టైనింగ్‌ మూవీ తీయడం ఎలా సాధ్యం? సినిమా విషయంలో నటీనటులు & దర్శక నిర్మాతలు ఎఫర్ట్స్ పెట్టారు. కామెడీ మాత్రం కుదరలేదు. అందువల్ల నవ్వించలేక కంగాళీగా మారిందీ సినిమా.

Rating: (2.25/5)

మరిన్ని వార్తలు

No categories found.