Download App
Movie Poster

Telusu Kada

Cast: Siddhu Jonnalagadda, Raashii Khanna, Srinidhi Shetty, Harsha Chemudu, Ravi Mariya, Rohini

Director: Neeraja Kona

Music Director: Thaman S

Producer: TG Vishwa Prasad, Vivek Kuchibhotla

Banner: People Media Factory

Release Date: October 17, 2025

తెలుసు కదా మూవీ రివ్యూ

Published అక్టోబర్ 17, 2025 by Srinivas

తెలుసు కదా రివ్యూ: కథ ఒక్కటే సరిపోదబ్బా!

సిద్దు హీరోగా, రాశి ఖన్నా & శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. లవ్ యు 2 క్యాప్షన్. నీరజ కోన దర్శకురాలిగా పరిచయమైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా నీరజ కోన అనుభవం పదేళ్లకు పైగా. కజిన్ బ్రదర్ కోన వెంకట్ పేరున్న రైటర్. ఆయన ప్రొడ్యూసర్ కూడా. కోన నీరజ ఇప్పుడు ‘తెలుసు కదా’తో దర్శకురాలిగా పరిచయమైంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా, రాశి ఖన్నా & శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా సినిమా తీసింది. లవ్ యూ 2 అనేది కాప్షన్. ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి. 

తెలుసు కదా రివ్యూ

కథ:

బాల్యంలో తల్లిదండ్రులను కోల్పోయిన వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ)కు ప్రేమ పెళ్లి చేసుకుని పిల్లలతో కలసి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరిక. అది నిజం అవుతుందని ఆశపడిన తరుణంలో అతడిని వదిలేసి వెళ్తుంది రాగ (శ్రీనిధి శెట్టి). దాంతో ప్రేమ మీద నమ్మకం కోల్పోతాడు వరుణ్. మాట్రిమోని సైట్ ద్వారా పరిచయమైన అంజలి (రాశి ఖన్నా)ని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలుస్తుంది. అది రాగకు తెలుస్తుంది. అప్పుడు ఆ దంపతుల బిడ్డకు సరోగసీ మదర్‌గా ఉండేందుకు అంగీకరిస్తుంది. సరోగసీ మదర్ రాగ తన భర్త మాజీ ప్రేయసి అని అంజలికి తెలిసిందా? రాగ రాకతో వరుణ్ – అంజలి జీవితాల్లో ఎటువంటి మార్పులు సంభవించాయి? అనేది మిగతా సినిమా. 

విశ్లేషణ:

మంచి కాన్‌ఫ్లిక్ట్‌ & కంటెంట్ ఉన్న కథ రాయడం ఒక్కటే సరిపోదు… ఆ కథకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలో, కథకు సరైన ముగింపు ఇవ్వడంలో దర్శక రచయిత ప్రతిభ బయటపడుతుంది. నీరజ కోనలో మంచి రచయిత ఉంది. ఈ జనరేషన్ యూత్ కనెక్ట్ అయ్యే పాయింట్ తీసుకుని కథ రాసుకుంది. కానీ ఆ కథకు జస్టిఫికేషన్ ఇచ్చే సీన్స్, క్లైమాక్స్ రాసుకోలేదు. హీరో హీరోయిన్లను తీసుకోలేదు. డైరెక్షన్ పరంగా ఆడియన్స్ కన్వీన్స్ అయ్యేలా సినిమా తీయలేదు. 

సిద్దు జొన్నలగడ్డ మంచి ఆర్టిస్ట్. ఎటువంటి క్యారెక్టర్‌లో అయినా పెర్ఫార్మన్స్ ఇవ్వగలడు. అయితే ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’తో అతనికి ఓ ఇమేజ్ వచ్చింది. అది ‘తెలుసు కదా’ కథ, అందులో క్యారెక్టర్‌కు మైనస్ అయ్యింది. సిద్దు నటనలో లోపం లేదు. స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. కానీ, టిల్లు ప్రభావం డైలాగ్ డెలివరీలో మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. హీరోయిన్లు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి నటన ఓకే. అయితే శ్రీనిధి క్యారెక్టర్‌లో క్లారిటీ లేదు. అందువల్ల ఎమోషన్స్ సరిగా పండలేదు. వైవా హర్ష కామెడీ టైమింగ్‌ ప్రేక్షకులకు రిలీఫ్.

తమన్ పాటలు సినిమాకు మంచి హైప్ ఇచ్చాయి. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సెట్ కాలేదు. హీరోని ఎలివేట్ చేసే మ్యూజిక్ కథతో సింక్ కాలేదు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ బావుంది. ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ అందంగా ఉంది. కలర్ టోన్ బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్ రిచ్ లుక్‌తో ఉంది.

Telusu Kada Review

తీర్పు:

బోల్డ్ కాన్సెప్ట్, కథ ఒక్కటే సరిపోదు… స్ట్రాంగ్ క్యారెక్టర్లు ఉన్నా క్యారెక్టరైజేషన్లకు సరిపోయే సన్నివేశాలు, సంభాషణలు సైతం ఉండాలి. ‘తెలుసు కదా’ కథ కొత్తదేమీ కాదు.. ఇటువంటి సినిమాలను హిందీ, తెలుగు సినిమాల్లో చూశాం. కొత్త సీసాలో పాత సారాయి అన్నట్టు తెలిసిన కథను స్టైలిష్‌గా చెప్పే ప్రయత్నం చేశారు నీరజ కోన, సిద్దు. ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా తీయలేదు. రెండు గంటలు కూర్చోవడం కష్టం.

Rating: (2.25/5)

మరిన్ని వార్తలు

No categories found.