Download App

బీసీలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ – కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

ఆగస్ట్ 6, 2025 By Srinivas
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడే ఇది బీసీలను వంచించే నాటకమని ముందే హెచ్చరించామని గుర్తు చేశారు. “42% రిజర్వేషన్లు ఇస్తామని ఢిల్లీకి వెళ్లి డ్రమా చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్ ఎక్కడ? ఇచ్చిన హామీలు...

బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడే ఇది బీసీలను వంచించే నాటకమని ముందే హెచ్చరించామని గుర్తు చేశారు.

“42% రిజర్వేషన్లు ఇస్తామని ఢిల్లీకి వెళ్లి డ్రమా చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్ ఎక్కడ? ఇచ్చిన హామీలు ఎక్కడ? దొంగ మాటలు, డ్రామాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించరు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్తారు,” అని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి రాజకీయ లాభం పొందాలనుకుంటోందని ఆరోపించిన ఆయన, ఇది తెలంగాణ ప్రజల మనసును దెబ్బతీసే చర్య అని వ్యాఖ్యానించారు. “బీసీల హక్కులు కాపాడటంలో బీఆర్ఎస్ పోరాటం ఆగదు,” అని స్పష్టం చేశారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

మరిన్ని వార్తలు

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading