Download App
Movie Poster

Balan: The Boy

Cast: Chandu Salimkumar, Girish AD, Farzana Palathingal, Ganapathi, Sandra Chandran, Beena Antony, Dolly June, Jean Paul Lal, Muhammed Zinaan, Adhisheshan KR

Director: Chidambaram S. Poduval

Producer: Venkat K. Narayana, Baker Ninan Fenn, Shailaja Desai Fenn

Banner: KVN Productions, Thespian Films Ltd

Release Date: June 19, 2026

బాలన్: ది బాయ్ మూవీ రివ్యూ

Published జూన్ 20, 2026 by Srinivas

దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ‘బాలన్: ది బాయ్’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్” అనే అంశాన్ని భావోద్వేగపూరితంగా చూపించేందుకు చేసిన యత్నమే ఈ చిత్రం. జీవించాలనే సంకల్పం ఉంటే చాలు.. ఎంతటి పరిస్థితులనైనా ఎదుర్కొని బతకగలమనే ఆలోచనకు దృశ్య రూపం. పాయింట్ అయితే అద్భుతంగా ఉంది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.

బాలన్: ది బాయ్ Movie Review

కథేంటంటే..

కథలో బాలన్ (చిన్న వయసులో ఆదిశేషన్, పెద్దయ్యాక మహమ్మద్ జినాన్), అతని అమ్మ (ఫర్జానా పలతింగల్) తమ అసలు గుర్తింపును దాచిపెట్టి, ఎప్పటికప్పుడు పేర్లు మార్చుకుంటూ ప్లేస్ మార్చుకుంటూ వెళుతుంటారు. తల్లి గతం మళ్లీ ఆమెను వెంటాడడంతో బాలన్‌కు దూరమవుతుంది. కానీ వారి బంధం అంతటితో తెగిపోయిందా? లేదా అనే అంశంతో కథ నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ నెరేషన్ అంతా చాలా స్లోగా ఉంటుంది. అయితే పాత్రల మానసిక స్థితిపై ఫోకస్ పెరుగుతూ ఉంటుంది. అలాగే తల్లీకొడుకుల బంధం, బాలన్‌లో క్రమంగా వస్తున్న మార్పులు చాలా నేచురల్‌గా అనిపిస్తున్నాయి. అమ్మ, అమ్మమ్మ పాత్రల మధ్య సారూప్యత, బాలన్‌కు తగిలిన చిన్ననాటి గాయాలు, అతని జీవితంపై ఎలాంటి ప్రభావం చూపాయన్న అంశాలను అతిగా చెప్పకుండా సున్నితంగా చూపించారు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. బాలన్ పెద్దవుతాడు. ఆ తర్వాత సినిమా టోన్ పూర్తిగా మారుతుంది. పోలీస్ అధికారి పవిత్రన్‌తో అతను చేసే పోరాటం, దొంగ అబ్బాస్ (టొవినో థామస్‌)తో గడిపే జీవితం వంటి అంశాలు అంతగా ప్రేక్షకుడికి కనెక్ట్ కావు. ఫస్ట్ హాఫ్‌లోని సెన్సిటివిటీ, ఉత్కంఠ అనేవి సెకండ్ హాఫ్‌కు వచ్చేసరికి తగ్గిపోతాయి. కథ కంటే సంఘటనలకే దర్శకుడు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా అబ్బాస్-బాలన్ బంధం ప్రేక్షకుడికి కనెక్ట్ అవడం కష్టమే.

బాలన్: ది బాయ్ Movie Review

ఎవరెలా నటించారంటే..

సినిమాలో ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకున్న వ్యక్తి ఫర్జానా పలతింగల్. అమ్మ పాత్రలో ఆమె జీవించారనే చెప్పాలి. చిన్న బాలన్‌గా ఆదిశేషన్ బాగా ఆకట్టుకున్నాడు. అబ్బాస్ పాత్రలో టోవినో థామస్ అద్భుతంగా నటించాడు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు ఫస్ట్ హాఫ్‌పై పెట్టినంత శ్రద్ధ.. సెకండాఫ్‌పై పెట్టలేదేమో అనిపిస్తుంది. అదే చేసి ఉంటే సినిమా ఓ రేంజ్‌లో ఉండేది. షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.
వివేక్ హర్షన్ ఎడిటింగ్ కూడా బాగుంది. సుశిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు హైలైట్.

ఫైనల్‌గా.. ‘బాలన్’ ఫస్ట్ హాఫ్ మెప్పించినంతగా సెకండాఫ్

Rating: (3/5)

మరిన్ని వార్తలు

No categories found.