Download App
Movie Poster

Pallaburusu

Cast: Sudhakar Reddy, Muralidhar Goud, Prajwal Yadma, Gomathy

Director: Uday Chauhan

Music Director: Pawan Ch

Producer: Annapurna Studios, Aditya Pittie, Vivek Krishnani

Banner: Annapurna Studios & EPIC Studios

Release Date: August 14, 2026

పళ్ళ బురుసు మూవీ రివ్యూ

Published ఆగస్ట్ 17, 2026 by Srinivas

వరుస చిత్రాలతో అలరిస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘పళ్ళ బురుసు’. తండ్రీకొడుకుల సెంటిమెంటు‌తో రూపొందిన చిత్రం కావడంతో పాటు సినిమా ప్రమోషన్స్.. దీని నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ కూడా అంచనాలను బీభత్సంగా పెంచేశాయి. నాగార్జున సైతం బలమైన కంటెంట్‌తో కూడిన చిత్రమని ప్రమోషన్స్‌లో చెప్పడం కూడా సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. మరి సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.

Pallaburusu Movie Review

కథేంటంటే..

తెలంగాణలోని ఓ పల్లెటూరిలో ఉండే శంభు (సుధాకర్‌ రెడ్డి) ఉంటారు. ఒంటరిగా ఉంటాడు.. పైగా వృద్ధుడు. పంటినొప్పితో బాధపడుతూ ఉంటాడు. ఆసుపత్రికి వెళ్లగా.. డాక్టర్‌ చికిత్స చేసి, కొన్ని మందులత పాటు టూత్ బ్రష్ వాడాలని చెబుతాడు. దీంతో ఆ పళ్ళ బురుసు (టూత్‌ బ్రష్‌) కొనివ్వమ్మని తన కొడుకు తిరుపతి (మురళీధర్‌ గౌడ్‌)కి చెబుతాడు. కొడుకు కొనిస్తాడు కానీ పిల్లలు ఆడుతూ ప్రిస్కిప్షన్‌తో సహా అన్నింటినీ పడేస్తారు. అది తెలియక శంభు కొడుకుపై కోపం పెంచుకుంటాడు. ఈ క్రమంలోనే తిరుపతి తన కూతురు వివాహం తలపెడతాడు. అందరినీ పిలుస్తాడు కానీ తండ్రిని పిలవడు. అయినా శంభు పెళ్లికి వెళతాడు. కానీ అక్కడ ఆయన్ను ఎవరూ పట్టించుకోరు. అవమాన భారంతో శంభు రగిలిపోతాడు. దీంతో పళ్ళ బురుసు కొనివ్వలేదంటూ కొడుకుపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతాడు. కేసు కోర్టుకు వెళుతుంది. కోర్టులో ఏం జరిగింది? శంభుకు న్యాయం జరిగిందా? అసలు శంభు కోరుకున్న న్యాయమేంటి? కొడుకు, స్నేహితుల తీరుతో విసిగిపోయిన శంభు చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తిరుపతిలో మార్పు ఏమైనా వచ్చిందా? ఈ కథలోని రవి (ప్రజ్వల్‌), రేఖ (గోమతి)ల ప్రేమ ప్రయాణం ఏ తీరానికి చేరింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Pallaburusu Movie Review

ఎలా ఉందంటే…

తల్లిదండ్రులు.. పిల్లలే ప్రాణంగా బతుకుతారు. వారిని ప్రయోజకులను చేయడం కోసం నానా తంటాలు పడతారు. చివరకు పిల్లలు పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులను పట్టించుకోరు. ఈ కథతో రూపొందినదే ‘పళ్లబురుసు’. వృద్ధాప్యంలోని తండ్రి కోరుకునేదేంటి? స్నేహితులు, కన్నకొడుకు పట్టించుకోకుంటే ఒంటరివాడైన కొడుకు ఏం చేస్తాడు? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో అల్లుకున్న కథే ఈ ‘పళ్ళ బురుసు’. ఒక చిన్న టూత్‌ బ్రష్‌ కోసం ఓ తండ్రి కేసు వేయడం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అయితే చివరకు తండ్రి కోరుకున్న న్యాయం ఏంటనేది ఆసక్తికరం. తండ్రీ కొడుకుల అనుబంధం, వారిమధ్య ఉన్న స్పర్థలు, భావోద్వేగాల్ని చూపించే ప్రయత్నం చేశారు. వయసై పోయిన వృద్ధులు ఒకచోట చేరి ఎలా కామెడీ చేసుకుంటారనేది కూడా ఆసక్తికరమే. అయితే దర్శకుడు కేవలం తండ్రి వర్షన్ మాత్రమే తీసుకుని.. తండ్రి చుట్టూ కథను రెండు గంటల పాటు నడిపించడంలో మాత్రం తడబడ్డారు. టైటిల్‌ కార్డ్స్‌తోనే ప్రేక్షకుల్ని నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లిన తీరు ఆసక్తికరం. కొడుకుపై ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చిందన్నది చెప్పడానికి మాత్రం చాలా టైమ్ తీసుకున్నాడు. అసలు తండ్రిని పిలవకుండా కొడుకు.. తన కూతురికి ఎందుకు వివాహం చేయాల్సి వచ్చిందన్న విషయంలో కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈమధ్యలో నడిచే రవి – రేఖల లవ్‌ట్రాక్‌ కూడా ఏమాత్రం ఆకట్టుకోదు. సెకండాఫ్ అంతా కొడుకు భూమి అమ్మాలనుకోవడం.. దాని చుట్టూ జరిగే డ్రామాతోనే దర్శకుడు నడిపించాడు. ఎండింగ్ మాత్రం భావోద్వేగాలతో మనసు బరువెక్కుతుంది. మొత్తంగా తీసుకున్న పాయింట్ బాగుంది కానీ దాని చుట్టూ అల్లిన కథ మాత్రం ఆకట్టుకోలేదు.

Pallaburusu Movie Review

ఎవరెలా చేశారంటే..

ఒంటరి వృద్ధ తండ్రిగా.. శంభు పాత్రలో సుధాకర్‌ రెడ్డి జీవించేశారు. చాలా సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించారు. ఇక కొడుకుగా తిరుపతి పాత్రలో మురళీధర్‌ గౌడ్ నటన చాలా బాగుంది. ప్రజ్వల్‌ యాద్మ, గోమతి తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది. కానీ దాన్ని ఆకట్టుకునేలా తెరపై ఆవిష్కరించడంలో తడబడ్డారు. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. పవన్‌ సీహెచ్‌ సంగీతం సినిమాకు ప్లస్. పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త వహించాల్సింది. నిర్మాణ విలువలు కథకి తగ్గట్లుగా ఉన్నాయి.

ఫైనల్‌గా.. ‘పళ్లబురుసు’ క్లైమాక్స్ కోసమైతే చూడొచ్చు

Rating: (2/5)

మరిన్ని వార్తలు

No categories found.