Download App
Movie Poster

Makutam

Cast: Vishal, Anjali, Dushara Vijayan, John Vijay, Jayaprakash, Ajay, Vamsi Krishna, Abu Salim, Jhansi, and others

Director: Vishal

Music Director: GV Prakash Kumar

Banner: Super Good Films

Release Date: August 14, 2026

మకుటం మూవీ రివ్యూ

Published ఆగస్ట్ 17, 2026 by Srinivas

స్టార్ హీరో విశాల్‌ (Vishal).. నటించి, దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘మకుటం’. విశాల్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే.. సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన 99వ చిత్రమిది. ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ చూసిన వారికి దాదాపుగా ‘మార్క్ ఆంటోనీ’ స్టైల్లోనే విశాల్ కనిపించాడు. దీంతో సినిమాపై పెద్దగా అంచనాలైతే లేవు. కానీ రిలీజ్ తర్వాత సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం.

Makutam Telugu Movie Review

కథేంటంటే..

చెన్నెలో మెడిక్ రిప్రజెంటేటివ్‌గా పని చేసే కృపాకరం (విశాల్‌).. నీతి, నిజాయతీలే ప్రాణంగా భార్య జమున (దుషారా విజయన్‌) ఇద్దరు పిల్లలతో హ్యాపీగా జీవిస్తూ ఉంటాడు. అయితే పెళ్లికి ముందు కారు కొంటేనే తన కూతురితో పెళ్లి చేస్తానని జమున తండ్రి కండీషన్ పెడతాడు. అప్పుడు తనకు కారు ఉందని అబద్దం చెప్పి జమునను పెళ్లి చేసుకుంటాడు. మామగారి కోరిక తీర్చాలని తపనతో ఉంటాడు. కానీ కారు కొనే స్తోమత కృపాకరానికి ఉండదు. దీంతో సెకండ్ హ్యాండ్ కారు కొని, కుటుంబాన్ని తీసుకుని విహారయాత్రకు వెళ్తాడు. అక్కడ కొందరు దుండగులు కృపాకరం కారుపై కాల్పులు జరపగా.. ఆ కాల్పుల్లో భార్య, కూతురిని కోల్పోతాడు. ప్రాణాలతో మిగిలిన కొడుకుని పట్టుకుని పారిపోతాడు. ఈ విషయం కృపాకరం తండ్రి, విశాఖపట్నం పోర్టును శాసించే లింగ (విశాల్‌)కు తెలుస్తుంది. బాధలో ఉన్న కొడుకును చూడటానికి లింగ వస్తాడు. ఆయన్ను చూడగానే కృపాకరం కోపంతో ఊగిపోతాడు. తన భార్య, బిడ్డల చావుకు లింగానే కారణమంటూ ఆరోపిస్తాడు. అసలు కృపాకరానికి తండ్రితో ఉన్న విభేదం ఏమిటి? ఎందుకు తండ్రికి దూరంగా బతుకుతున్నాడు? కృపాకరం కుటుంబంపై దాడి చేసిన వ్యక్తులెవరు? వాళ్లకీ లింగాకూ ఉన్న సంబంధం ఏంటి? లింగ కుటుంబానికి నాగ(అజయ్)తో ఉన్న వైరమేంటి? లింగ భార్య అన్నపూర్ణ (అంజలి) ఏమైంది? మరి చివరకు తండ్రీకొడుకులు కలిశారా? లేదా? అనే విషయాలను సినిమా చూసి తెలుసుకోవాలి.

ఎలా ఉందంటే…

విశాల్ ఇప్పటి వరకూ వైవిధ్యమైన కథలో ప్రేక్షకుల ముందుకొచ్చి స్టార్ హీరో తన స్థానాన్ని సుస్థిం చేసుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన ఇంత కాలానికి ఒక యాక్షన్ డ్రామాతో దర్శకుడిగా మారారు. విశాల్ డైరెక్షన్ అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. కానీ వాటిని అందుకునే స్థాయిలో సినిమా అయితే లేదు. ఒ రొటీన్ డ్రామాను తీసుకుని దానికి కొంత యాక్షన్ జోడించి జనాలపైకి వదిలారు. వాస్తవానికి ఈ సినిమా ఆది నుంచి చూసే ప్రేక్షకుడికి విసుగ్గానే ఉంటుంది. కృపాకరాన్ని ఒక మెడికల్ రిప్రజెంటేటివ్‌గానూ.. అతని వ్యక్తిత్వం, కుటుంబాన్ని పరిచయంతో సినిమాను మొదలు పెట్టారు. అలాగే సినిమాను కంటిన్యూ చేసి ఉంటే ఎలా ఉండేదో కానీ.. కారు, ఆర్థిక పరిస్థితుల చుట్టూతే సినిమాను దాదాపుగా సగం నడిపించేశారు. కనీసం ఆ సన్నివేశాలైనా బాగున్నాయా? అంటే అదీ లేదు. సహనానికి ఒకరకంగా పరీక్షే. ఆ తరువాత ఊటీ వెళ్లడం అక్కడ కాల్పులు.. ఆ తరువాత కథలో వేగం పుంజుకుంటుంది. కుటుంబాన్ని కోల్పోయిన కృపాకరాన్ని తండ్రి లింగ ఎంట్రీ ఇస్తాడు. తండ్రిని చూసిన వారికి ఓ రేంజ్ బ్యాక్‌గ్రౌండ్ ఉందేమో అనిపిస్తుంది. కానీ అది కూడా చాలా రొటీన్‌గా ఉండటంతో చూసే ప్రేక్షకుడిలో ఉత్సాహం పూర్తిగా పోతుంది. దీనికి తోడు లింగ-అన్నపూర్ణ లవ్ స్టోరీ ఒకటి. చాలా చాలా రొటీన్ మాత్రమే కాదు.. సాగదీతగా కూడా ఉంటుంది. సినిమా మొత్తమ్మీద కాస్త కొత్తగా అనిపించిందేంటంటే.. ఓడలో ఉన్న సరకు బయటకు రాకుండా లింగ అడ్డుకోవడం మాత్రమే. క్లైమాక్స్‌ను కూడా రొటీన్‌గానే ముగించారు.

Makutam Telugu Movie Review

ఎవరెలా చేశారంటే..

విశాల్ ఎప్పటిలాగే అద్భుతమైన నటనను కనబరిచారు. కృపాకరం, లింగ పాత్రల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించారు. యాక్షన్ సన్నివేశాల్లో చాలా బాగా నటించారు. దుషారా విజయన్‌, అంజలి కూడా చక్కని నటనతో ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

ఈ సినిమా చూసిన వారికి విశాల్ హీరోగా కంటిన్యూ అయితేనే బాగుంటుందనిపిస్తుంది. దర్శకుడిగా అట్టర్ ఫ్లాప్ అనే చెప్పాలి. ఒక రొటీన్ కథ, కథనంతో ప్రేక్షకులకు విసుగు తెప్పించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం సినిమాను ఓ మెట్టు ఎక్కించింది. ఎడిటింగ్ చాలా పేలవంగా ఉది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగానే ఉన్నాయి.

ఫైనల్‌గా: ‘మకుటం’.. ఓ రొటీన్ యాక్షన్ డ్రామా

Rating: (2/5)

మరిన్ని వార్తలు

No categories found.