Download App
Movie Poster

Peddi

Cast: Ram Charan, Shiva Rajkumar, Janhvi Kapoor, Jagapathi Babu, Divyenndu, Boman Irani, Ravi Kishan, Viji Chandrasekhar, Rajatava Dutta, Satya, John Vijay, Ajay Ghosh, Upendra Limaye, Aadukalam Naren, Tarak Ponnappa, Mahesh Achanta, Shruti Haasan (Special Appearance)

Director: Buchi Babu Sana

Music Director: AR Rahman

Producer: Venkata Satish Kilaru, Ishan Saksena

Banner: Mythri Movie Makers, Sukumar Writings, Vriddhi Cinemas, IVY Entertainment

Release Date: June 3, 2026

పెద్ది మూవీ రివ్యూ

Published జూన్ 4, 2026 by Srinivas

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పెద్ది’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్స్‌ను పీక్స్‌లో నిర్వహించారు. దీంతో సినిమాకు బీభత్సమైన హైప్ వచ్చింది. తొలుత గ్లింప్స్ వదిలినప్పుడు అది చూసిన అభిమానులు బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నారు. ట్రైలర్‌కు మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. చిత్ర యూనిట్ మాత్రం సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది. ఇంతకీ మూవీ ఎలా ఉంది? చూద్దాం.

కథేంటంటే..

2016 ఒలింపిక్స్ క్రీడలు ముగింపు తర్వాత నుంచి ఈ కథ మొదలవుతుంది. కోల్‌కతా నుంచి విజయనగరం మీదుగా కొండ కింద ఊరికి సాగే ప్రయాణంతో అసలు కథ ప్రారంభమవుతుంది. విజయనగరంలో జిల్లా స్థాయి పోటీలు జరుగుతూ ఉంటాయి. చాలా మంది నోట ‘పెద్ది’ మాట విన్న బొమ్మన్ ఇరాని ఆశ్చర్యపోతారు. అసలు ఆ పెద్ది ఎవరో తెలుసుకోవాలని అనుకుంటారు. అలా అతనికి పెద్ది వాళ్ల ఊరుకు చెందిన వ్యక్తి తగులుతాడు. అతడు పెద్ది స్టోరీ చెప్పుకుంటూ ఆ ఊరికి తీసుకెళ్లడం ప్రారంభిస్తాడు. పెద్ది ఉండే ఊరికి ఒక పేరంటూ ఉండదు. కొండ కింద ఉంటుంది కాబట్టి కొండ కింద ఊరుగా పిలుచుకుంటారు. కనీసం గుర్తింపుకు సైతం నోచుకోని గ్రామమది. 1800 మంది నివసించే ఆ గ్రామానికి వెళ్లాలంటే ఒకరోజు కేటాయించుకోవాల్సిందే. కొండల్లో పడి.. వాగులు దాటుకుంటూ వెళ్లాలి. ఇక ఆ ఊరి ప్రజలు కూడా బతుకుదెరువు కోసం నానా కష్టాలు పడుతుంటారు. పెద్దితో పాటు ఆ ఊరి ప్రజలంతా బెల్లం తయారీ సంస్థలో రోజు కూలి రూ.10 పని చేస్తుంటారు. పెద్ది ఇటు పని చేస్తూనే క్రికెట్ ఆడుతూ ఉంటాడు. అతడిని కూలి ఆటగాడిగా సెలక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక తమ ఊరిలో కనీసం ట్రైన్ ఆగితేనన్న జనాల కష్టాలు పోతాయని భావించే అప్పలసూరి (జగపతిబాబు) దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నంలోనే విజయం సాధిస్తాడా? క్రికెటర్ అయిన పెద్ది.. రెజ్లర్‌గా.. ఆపై అథ్లెట్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? కూలి అయిన పెద్ది ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నాడు? చివరకు పెద్ది తన ఊరికి గుర్తింపు తెచ్చాడా? దానికోసం అతను ఏం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

గుర్తింపే ఆత్మగౌరవంగా భావించి ఓ యువకుడు సాగించే పోరాటమే ఈ సినిమా. తన ఊరి కోసం ఓ యువకుడు పడే తపన ఇది. దానికోసం అతను ఎంతవరకైనా వెళ్లడం వంటి అంశాలతో రూపొందింది. స్పోర్ట్స్ డ్రామాలనేవి వర్కవుట్ అయితే బీభత్సంగా అవుతాయి. అటు ఇటు అయితే ఇబ్బందే. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పటి వరకూ మనం చూసిన స్పోర్ట్స్ డ్రామాలన్నీ ఏదో ఒక ఆట ఆధారంగా తెరకెక్కినవే. కానీ ఇది మాత్రం మూడు గేమ్‌లతో ముడిపడింది. తొలుత అద్భుతమైన క్రికెట్ ప్లేయర్ కాస్తా.. తన ఊరి గుర్తింపు కోసం రెజ్లర్‌గా మారతాడు. ఆపై అథ్లెట్ కూడా అవుతాడు.    సినిమాలో హీరో ఊరు, వారి స్థితిని ఒకరకంగా చెప్పాలంటే దరిద్రాన్ని ఎక్కువగా చూపించాడు. సినిమా చివరి వరకూ కష్టాలు, ఏడుపులు, కడగండ్లతోనే సాగింది. పైగా ఏదైనా ఒక గేమ్ అయితే సినిమా వేరే లెవల్‌లో ఉండేది. కానీ మూడు గేమ్‌లు ఆడించడం సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్‌ను చాలా బాగా తీసుకెళ్లిన బుచ్చిబాబు సాన.. సెకండ్ హాఫ్‌కు వచ్చే వరకూ సినిమాను గందరగోళం చేసేశారు. క్రికెట్ నుంచి రెజ్లర్‌గా మార్చారు ఓకే.. అక్కడి నుంచి ఆసక్తికరంగా కథ నడిపిస్తే బాగుండేది. కానీ అక్కడో ఎమోషనల్ డ్రామా నడిపించి.. అక్కడి నుంచి అథ్లెట్ వైపు నడిపించడమనేది ప్రేక్షకులకు నచ్చడం కాస్త కష్టమే. సినిమాలో కేవలం కష్టాలు, కడగండ్లే కాకుండా అప్పుడప్పుడు కాస్త హుషారైన సన్నివేశాలు పెట్టి ఉంటే బాగుండేదేమోనని అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకూ సినిమా హిట్ పక్కా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి కొంచెం కష్టమేనని అనిపించక మానదు.

ఎవరెలా నటించారంటే..

పెద్దిగా రామ్ చరణ్ జీవించాడు. తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుగా అనిపిస్తుంది. డ్యాన్స్‌లు సైతం అదరగొట్టేశాడు. యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే అతని కష్టం మనకు తెలుస్తోంది. మొత్తానికి ఇది రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. కానీ కథ ఎంచుకోవడంలోనే ఇటీవలి కాలంలో కాస్త తడబడుతున్నాడేమో అనిపించింది. ఇక జాన్వీ కపూర్ విషయానికి వస్తే ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్ర. కనీసం గ్లామర్ కోసం పెట్టారనుకున్నా వెండితెరపై కాసేపే కనిపిస్తుంది. ఇక జగపతిబాబు అద్భుతంగా నటించారు. సినిమాలో అప్పలసూరి మాత్రమే కనిపిస్తాడు. జగపతిబాబు కనిపించరు. ఇక ఈ చిత్రంలో కీలక పాత్ర అంటే శివరాజ్ కుమార్. అద్భుతంగా నటించారు. పెద్దిని అద్భుతమైన రెజ్లర్‌గా తీర్చిదిద్దే గురువు గౌరీ నాయుడు పాత్రలో ఆయన మెప్పించారు. ఇతర పాత్రల్లో నటించిన వారంతా తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.

టెక్నికల్ పరంగా..

బుచ్చిబాబు సాన కథను ఒకే ఆటతో రాసుకుని దానిని వినూత్నంగా తీర్చిదిద్ది ఉంటే చాలా బాగుండేది. ఫస్ట్ హాఫ్‌తో మెప్పించినంతగా సెకండ్ హాఫ్‌తో మెప్పించలేకపోయారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి చెప్పేదేముంది? ఆల్రెడీ పాటలన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. ఇక ఎడిటింగ్ విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా తగినట్టుగా ఉన్నాయి.

తీర్పు: పెద్ది ఫస్ట్‌హాఫ్ మెప్పిస్తుంది.. సెకండ్ హాఫ్ నొప్పిస్తుంది

ఎగ్జిబిటర్స్ కొత్త నిర్ణయం.. ‘పెద్ది’ రిలీజ్‌పై ప్రభావం పడుతుందా?

తీర్పు: పెద్ది ఫస్ట్‌హాఫ్ మెప్పిస్తుంది.. సెకండ్ హాఫ్ నొప్పిస్తుంది.

Rating: (3/5)

మరిన్ని వార్తలు

No categories found.