బాహుబలి ది టార్చ్ బేరర్ వెబ్ సిరీస్ రివ్యూ
Published జూన్ 27, 2026 by Srinivas
తెలుగు సినిమా చరిత్రను మలుపుతిప్పిన చిత్రమే ‘బాహుబలి’. ఈ సినిమాను చూసేశాం. ఆ తరువాత వచ్చిన సీక్వెల్‌నూ చూసేశాం. కానీ ఈ రెండు సినిమాలను తీసేందుకు మేకర్స్ పడిన కష్టం మాత్రం మనకు తెలియదు. ఆ కష్టాన్ని తెలియజేస్తూ, చూపించేందుకు చేసిన ప్రయత్నమే ‘బాహుబలి ది టార్చ్ బేరర్’. 4 ఎపిసోడ్‌లుగా వచ్చిన ఈ సిరీస్‌లో ఏం చూపించారు? అసలు అది ఎలా ఉంది తెలుసుకుందాం.
కొన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్‌లుగానూ.. మరికొన్ని క్లాసిక్స్‌గా మిగిలిపోతాయి. ‘బాహుబలి’ విషయానికి వస్తే.. అంతకు మించి అనేలా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సినిమాను మరీ ముఖ్యంగా తెలుగు సినిమాను చూసే విధానాన్ని అది మార్చేసింది. తెలుగు సినిమా చరిత్రను ప్రపంచానికి చాటింది. ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ కేవలం ఒక సినిమా నిర్మాణం గురించిన డాక్యుమెంటరీ మాత్రమే కాదు. చరిత్రను తిరగరాసిన ఒక కలకు అపురూపమైన నివాళిగా చెప్పవచ్చు. ప్రభాస్ హీరోగా ఆయన రూపొందించిన ఈ ఎపిక్ యాక్షన్ మూవీ. కానీ ఆ మూవీకి కూడా విడుదలైన తొలి రోజు విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చిందని రాజమౌళి, రమా రాజమౌళి దంపతులు గుర్తు చేసుకున్నారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే నష్టాలు పూడ్చడానికి మణికొండలో ఉన్న సైట్ అమ్మేయాలని డిసైడ్ అయ్యామని తెలిపారు. అలాంటి ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రం ఆ తరువాత పాన్ ఇండియాని షేక్ చేసింది. ఆ తరువాత వచ్చిన సీక్వెల్ ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.
ఇప్పటికీ అంటే ఈసినిమా వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఏదైనా సినిమా గురించి చెప్పాల్సి వస్తే ‘బాహుబలి’తో కంపేర్ చేసి మాత్రమే చెబుతారు. అలాంటి అద్భుతమైన సినిమాని తెరకెక్కించడానికి జక్కన్న అండ్ టీమ్ ఎంతగా కష్టపడ్డారనేది ‘బాహుబలి ది టార్చ్ బ్యారర్’లో అద్భుతంగా చూపించారు. ఈ డాక్యుమెంటరీ ఒక గొప్ప ప్రయాణం ఆరంభానికి ప్రేక్షకులను తీసుకెళ్లి అసలు ఆ అవకాశం ఎవరికి ఎలా వచ్చిందో చెప్పడం జరుగుతుంది. తెర వెనుక దృశ్యాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ఇంటర్వ్యూలు వంటివన్నీ చూపించారు. అలాగే నటీనటులంతా సినిమా అవకాశం తమకు ఎలా వచ్చింది? షూటింగ్ జ్ఞాపకాలు, ‘మహిష్మతి’ని సృష్టించడానికి పడిన కఠోర శ్రమను డాక్యుమెంటరీలో చూపించడం జరిగింది. ఈ డాక్యుమెంటరీని చూస్తుంటే.. బాహుబలి అనేది కేవలం భారీ సెట్లు లేదా విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాత్రమే కాదని మనకు తెలియజేస్తుంది. సినిమాలో కొన్ని మరపురాని పాత్రలు, బలమైన భావోద్వేగాలను చూడవచ్చు.

ఎలా ఉందంటే..
తొలి ఎపిసోడ్‌లో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణన్, సత్యరాజ్ తదితర సినిమాతో సంబంధమున్న కీలక వ్యక్తులు సినిమా షూటింగ్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందనే అనుభవాలను పంచుకున్నారు. ఆ అనుభవాలన్నీ చెబుతుంటే ప్రేక్షకులు చాలా ఆసక్తితో కనెక్ట్ అవడం ఖాయం. ఈ డాక్యుమెంటరీని చూస్తుంటే.. భారతదేశపు అతిపెద్ద ఫిల్మ్ ఫ్రాంచైజీలలో ఒకటైన బాహుబలి వెనుక ఉన్న పోరాటాన్ని మనం చూడవచ్చు. ‘ది టార్చ్ బేరర్’కు అతిపెద్ద బలం వచ్చేసి అది మోసుకొచ్చే భావోద్వేగమే కావడం విశేషం. అంతటి భారీ చిత్రాన్ని రూపొందించే క్రమంలో ఎదుర్కొన్న ఒత్తిడి.. ముందుకు నడిపించిన అంశాలు వంటివన్నీ డాక్యుమెంటరీలో చూపించారు కాబట్టి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల సమయంలో తమ అనుభూతిని ప్రభాస్ పంచుకున్నారు.
మూడో ఎపిసోడ్‌లో పూరి జగన్నాథ్ సైతం తన ఎక్స్‌పీరియన్స్‌ని గుర్తు చేసుకున్నారు. ఆయన చెప్పిన సంఘటన ఈ డాక్యుమెంటరీకి హైలైట్ అని చెప్పాలి. చాలా ఆసక్తికరంగా ఉంది. నాలుగవ ఎపిసోడ్ విషయానికి వస్తే.. జపాన్‌లో నిర్వహించిన ప్రమోషన్స్.. అక్కడి ప్రేక్షకులు సినిమాతో ఎంతలా కనెక్ట్ అయ్యారనేది ఆసక్తికరంగా చూపించారు. మొత్తానికి బాహుబలి రెండు సిరీస్‌లను రాజమౌళి ఎంత అద్భుతంగా అయితే చూపించారో.. ఈ డాక్యుమెంటరీ అంతే ఆసక్తికరంగా అనిపిస్తుంది. బాహుబలి: ది టార్చ్ బేరర్’ అనేది సమిష్టి కృషితో పాటు ఒక ఫిక్షనల్ ప్రపంచాన్ని సృష్టించేందుకు చేసిన కృషిగా చెప్పవచ్చు. ‘బాహుబలి’ యుద్ధ నేపథ్యమున్న సినిమా మాత్రమే కాదని.. అసలు ఈ సినిమా చేసేందుకే ఒక యుద్ధం చేయాలని రాజమౌళి చెప్పడం ఆసక్తికరం. ఫైనల్‌గా ‘బాహుబలి 3’ ఉంటుందని చెప్పి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు. మొత్తానికి ‘బాహుబలి ది టార్చ్ బేరర్’ ప్రేక్షకులను కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు.
ఫైనల్‌గా.. ‘బాహుబలి ది టార్చ్‌బేరర్’ ఒక అద్భుతమైన చరిత్రకు నివాళి
Rating: 



(3/5)
