Download App

Azadi 501

OTT Platform: Aha

Cast: Sai Teja Kalvakota, Harsha Vardhan, Shashank, Geetha Bhaskar, Ravi Varma, Rocky Krishna, Prashanth Chanikya Chakravarthy, Yashwanth Kor, Kushalini Pulapula, Visalakshi, Bunty, Meghana Gujarati, Videha

Director: Shiva Teja

Genre: Drama, Thriller

Seasons: 1

Episodes: 6

Language: Telugu

Release Date: July 29, 2026

ఆజాదీ 501 వెబ్ సిరీస్ రివ్యూ

Published జూలై 29, 2026 by Srinivas

‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్‌ఫోన్ స్కామ్ ఇండియన్ కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత సంచలనం సృష్టించింది. దీని ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ఆజాదీ 501’. ఇండియన్ చరిత్రలో సంచలనం సృష్టించిన స్కామ్ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ కావడంతో ఆటోమేటిక్‌గానే దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ వెబ్ సిరీస్ అందుకుందా? తెలుసుకుందాం.

Azadi 501 Review and Rating

కథేంటంటే..

జితేంద్ర వర్మ (సాయి తేజ కల్వకోట).. పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని కలలు కంటుంటాడు. జితేంద్ర స్నేహితుడే కిషన్ పటేల్. వడ్డీ వ్యాపారం ఇతని ఫ్యామిలీ బిజినెస్. కానీ అది పటేల్‌కు నచ్చదు. ఏదైనా బిజినెస్ చేయాలనేది అతని కోరిక. జితేంద్రకు పరిస్థితి బాగోలేక జాబ్‌లో జాయిన్ అవుతాడు. పటేల్ మాత్రం బిజినెస్ కోసం ఇన్వెస్టర్ల కోసం వెదుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి వెళ్లి శ్రీకాంత్ మెహతాను కలుస్తారు. ఎలక్ట్రిక్ వెహికిల్ కంపెనీ పెడదామనుకుంటున్న తన కలను శ్రీకాంత్‌కు పటేల్ వివరిస్తాడు. కానీ శ్రీకాంత్ వర్కవుట్ కాదని చెబుతాడు. బిజినెస్‌లో సెల్ఫిష్‌గా ఉండాలని.. జనాల గురించి ఆలోచించవద్దని శ్రీకాంత్ వాళ్లకు చెబుతాడు. ఆఫీసులో తనను అవమానించిన బాస్‌ని కొట్టి కంపెనీ నుంచి బయటకు వస్తాడు జిత్తు. తను జాబ్ మానేసిన విషయాన్ని తల్లి (గీతా భాస్కర్)కి చెబుతాడు. ఆమె తనకు ఆ విషయం తెలుసని.. తను జాబ్ చేస్తానని వెళుతుంది. అది చూసిన జిత్తు.. ఇక ముందు ఏం చేసినా పెద్దగా చేయాలని డిసైడ్ అవుతాడు. అలా బిజినెస్ ప్లాన్ ఆలోచిస్తుండగా.. తల్లికి యాక్సిడెంట్ అయ్యిందంటూ కాల్ వస్తుంది. హాస్పిటల్ బిల్ రూ.10 వేల కోసం తెలిసిన వాళ్లందరికీ కాల్ చేస్తాడు. కానీ ఉపయోగం ఉండదు. వాటిని కూడా తల్లే అరేంజ్ చేస్తుంది. జిత్తు భావోద్వేగానికి గురవుతాడు. ఆ తరువాత ఒక మంచి బిజినెస్ ప్లాన్‌తో శ్రీకాంత్ దగ్గరకు వెళతాడు. శ్రీకాంత్ కూడా దానికి ఓకే చెప్పి.. బిజినెస్‌కి కావల్సిన అరేంజ్‌మెంట్స్ అన్నీ చేస్తాడు. ఇంతకీ జిత్తు ప్రారంభించిన బిజినెస్ ఏంటి? దానితో కోట్ల రూపాయలను ఎలా కొల్లగొట్టాడు? జిత్తు బిజినెస్‌కి సెంట్రల్ మినిస్టర్ శరత్ గోయల్‌ (హర్షవర్దన్)కి సంబంధమేంటి? అసలు జిత్తు బిజినెస్ చేశాడా.. స్కామా? ఆజాదీ 501 స్కామ్ ఏంటి? చాణక్య చక్రవర్తి (శశాంక్) ఎవరు? వంటి అంశాలను వెబ్‌సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే..

ఇటీవలి కాలంలోకార్పొరేట్ స్కామ్‌లు, బ్యాంక్ స్కామ్‌లు, ఫైనాన్షియల్ మోసాల ఆధారంగా రూపుదిద్దుకునే వెబ్ సిరీస్‌లకు మంచి క్రేజ్ ఉంది. ఈ కోవలోనే రూపొందిన ‘స్కామ్ 1992’, ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ వంటి సిరీస్‌ల విజయం తర్వాత.. ఇప్పుడు ‘ఆజాదీ 501’ సిరీస్ వచ్చేసింది. కొన్నేళ్ల క్రితం ఇండియాలో అతి తక్కువ ధరకే (కేవలం రూ.251 లకే) అత్యాధునిక స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ ‘ఫ్రీడమ్ 251’ అనే స్టార్టప్ కంపెనీ సంచలనం రేపింది. ఆ తరువాత రాత్రికి రాత్రే కోట్లాది రూపాయిల బుకింగ్స్ సాధించి వార్తల్లో నిలిచింది. అప్పట్లో ఇదో హాట్ టాపిక్. ఇక ఈ వెబ్‌సిరీస్ సైతం ఓ యువకుడి కష్టాలను ముందుగా చూపించి.. ఆ తరువాత డబ్బు కోసం ఓ పెద్ద స్కామ్ దిశగా ఎలా టర్న్ అయ్యాడనేది చాలా ఆసక్తికరంగా చూపించారు. ‘అందరికీ సాంకేతికత’ అనే ఆకర్షణీయమైన మేడ్ ఇన్ ఇండియా నినాదంతో ప్రారంభించే ఒక సాంకేతిక స్టార్టప్, దేశ ప్రజల దృష్టిని ఎలా ఆకర్షించిందనేది పెద్దగా సమయం తీసుకోకుండానే దర్శకుడు చెప్పేశాడు. అడుగడుగునా ఉత్కంఠగా ఈ సిరీస్ సాగుతుంది. పైకి ఎదిగాడనుకుంటున్న తరుణంలో ఏవో ఒక అవాంతరాలు.. వాటిని దాటేందుకు జితేంద్ర వర్మ ఏం చేశాడు? అనేది ఆసక్తికరం. కేవలం మోసాన్ని మాత్రమే కాకుండా, ఓవర్‌ నైట్‌లో కోటీశ్వరులు కావాలనే అత్యాశ, వ్యవస్థలోని లొసుగులను వాడుకునే తీరును ఈ సిరీస్ లోతుగా విశ్లేషించింది. అలాగే స్మార్ట్ ఫోన్ పిచ్చి.. దాని కోసం వినియోగదారులు వెనుకా ముందూ చూడకుండా అతిగా నమ్మి డబ్బు వెచ్చించే మనస్థత్వాన్ని దర్శకుడు చక్కగా చూపించారు.

Azadi 501 Review and Rating

ఎవరెలా నటించారంటే..

సాయి తేజ కల్వకోట తన పాత్రలో ఒదిగిపోయారు. కుటుంబానికి అండగా ఉండాలనుకున్న యువకుడు.. పరిస్థితులు సహకరించక ఇబ్బందులు పడటం.. ఆ తరువాత పెద్ద స్కామ్‌కు పాల్పవడం వంటి సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. ఒక ముఖ్య పాత్రలో నటించిన హర్షవర్ధన్ తన పాత్రలో జీవించేశారు. గీతా భాస్కర్, శశాంక్ సైతం చాలా సహజంగా నటించారు. కిషన్ పటేల్, శ్రీకాంత్ మెహతా తదితర పాత్రల్లో నటించిన వారంతా తమ పాత్రలో చక్కగా నటించారు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు ‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్ ఫోన్ స్కామ్‌ను చక్కగా వెబ్‌సిరీస్‌లా మలిచి ప్రేక్షకులకు అందించారు. మ్యూజిక్ కూడా సిరీస్‌కు తగినట్టే బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి. ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ఇబ్బందికర సన్నివేశాలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ చూడవచ్చు.

ఫైనల్‌గా.. ఆజాదీ 501.. ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్

Rating: (3/5)

మరిన్ని వార్తలు

No categories found.

Trending Now