Download App

Panchanama

OTT Platform: Zee5

Cast: Bharat Nivas, Shivaji Raja, Medha Reddy, Charan Babu, Rupa Lakshmi, Radhika Preethi, Surya, Sreeja, Mohan Srivatsa

Director: Mohan Srivatsa

Genre: Thriller, Mystery

Seasons: 1

Episodes: 6

Language: Telugu

Release Date: September 12, 2026

పంచనామా వెబ్ సిరీస్ రివ్యూ

Published సెప్టెంబర్ 12, 2026 by Srinivas

‘ప్రేమిస్తే’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు భరత్ నివాస్. ఆ తరువాత ఒకటీ అర చిత్రాల్లో కనిపించిన ఆయన తిరిగి ఇంత కాలానికి ‘పంచనామా’ అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వెబ్‌సిరీస్‌ని ఉదయభాను నిర్మించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.

Panchanama Web Series Review

కథేంటంటే…

 పోలీస్ ఆఫీసర్ అయిన జైరామ్ (భరత్ నివాస్) వేరే స్టేషన్‌కు బదిలీ అవుతాడు. రిలీవ్ అవడానికి ముందు తన తమ్ముడు ఆది (చరణ్ బాబు) మరణ వార్త ఆయనకు తెలుస్తుంది. ఆదిని ఎవరో కావాలనే చంపారని గ్రహిస్తాడు. తమ్ముడి మరణంతో ఎంతగానో కృంగిపోయిన జైరామ్ అతని మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు. ఆ సమయంలో అర్ధరాత్రి పెట్రోలింగ్‌లో ఉండగా.. ఓ వ్యక్తి టు వీలర్‌పై తీసుకుని ఉల్లిపాయ బండిని ఆపుతాడు. అందులో రెండు చేతులు ఉంటాయి. వాటిని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు ముగ్గురి ఫింగర్ ప్రింట్స్‌ను గుర్తిస్తారు. ఆది చనిపోయిన సమయంలోనే మరో ఇద్దరు కూడా మరణించారన్న విషయాన్ని జైరామ్ తెలుసుకుంటాడు. ఆ ముగ్గురి హత్యలకు ఏదో లింక్ ఉందని గ్రహిస్తాడు. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మరో మలుపు తీసుకుంటుంది. అసలు ఆ ముగ్గురిని ఎవరు చంపేశారు? ముగ్గురికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఈ మర్డర్స్ వెనుక ఉన్న సూత్రధారి ఎవరు? జైరామ్ అక్క ఎలా మరణించింది? వంటి విషయాలను వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే..

వెబ్ సిరీస్.. ప్రెజెంట్, పాస్ట్‌ల నేపథ్యంలో నడుస్తూ ఉంటుంది. అసలు జైరామ్ ఎవరు? అతని జీవితంలోకి ఆది ఎలా వచ్చాడు? వంటి విషయాలను చూపిస్తూనే.. మర్డర్స్.. వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పార్ట్‌ను దర్శకుడు చూపించారు. ఆరు ఎపిసోడ్స్‌తో సీజన్ 1 ఉంటుంది. సీజన్ 2కి లీడ్ కూడా వదిలారు. అయితే సీజన్ 1 ప్రారంభం ఆసక్తికరంగానే సాగింది. అక్కతో జైరామ్‌కు ఉన్న అనుబంధాన్ని చూపిస్తూనే.. అతని జీవితంలోని ట్రాజెడీ పార్ట్‌ను దర్శకుడు చూపించారు. తమ్ముడి మర్డర్‌తో రంగంలోకి దిగిన జైరామ్‌కు మరో రెండు మర్డర్స్ గురించి తెలుస్తుంది. ఆ మూడు మర్డర్స్‌కి మధ్య కనెక్షన్ ఏంటి? అసలు ఆ మర్డర్స్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తిని నడిపిస్తున్న అసలు సూత్రధారి ఎవరు అనే ఇన్వెస్టగేషన్ పార్ట్ అంతా చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. అంతా బాగా నడిచింది కానీ మర్డర్స్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరనేది మాత్రం సింపుల్‌గా తేల్చేయడమే కాస్త మైనస్ అనిపించింది. వెబ్‌సిరీస్ అంతా ఎంగేజింగ్‌గా నడిపించి ఆ ఒక్క విషయంలో దర్శకుడు తప్పులో కాలేశారేమో అనిపించింది. ఓవరాల్‌గా అయితే వెబ్‌సిరీస్ ఎంగేజ్ చేస్తుంది.

ఎవరెలా నటించారంటే..

పోలీస్ ఆఫీసర్ జైరామ్‌గా భరత్ నివాస్ అద్భుతంగా నటించారు. ఆయన తమ్ముడు మరణించిన సమయంలో ఎమోషన్‌ను కూడా అద్భుతంగా చూపించారు. చరణ్ బాబు పాత్ర నిడివి చాలా తక్కువ. ఆయన కూడా బాగానే చేశారు. శివాజీ రాజా, రూపలక్ష్మి సైతం తమ పాత్రల్లో ఒదిగిపోయారు. తనయుడిని పోగొట్టుకున్న తండ్రిగా శివాజీ రాజా ఆకట్టుకున్నారు. డాక్టర్‌గా రూపలక్ష్మి కనిపించి మెప్పించారు. మిగిలిన వాళ్లంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు మోహన్ శ్రీవత్స ఇన్వెస్టిగేషన్ పార్ట్‌పై మరింత ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. అయినా కూడా ఎపిసోడ్స్ అన్నీ చాలా ఆసక్తికరంగా నడిపించారు. బీజీఎం బాగానే ఉంది. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు వెబ్ సిరీస్‌కి తగినట్టుగా ఉన్నాయి.

ఫైనల్‌గా.. ‘పంచనామా’ ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్..

Rating: (2.75/5)

మరిన్ని వార్తలు

No categories found.

Trending Now