Download App

Veerabhadruni Rahasyam (Part-2)

OTT Platform: Zee 5

Cast: Annie, Raghu Kunche, Raghu, Abhinav, Kamal Thumu, Anuradha

Director: Naga

Genre: Thriller, Drama

Seasons: 1

Language: Telugu

Release Date: September 16, 2026

వీరభద్రుని రహస్యం (Part-2) వెబ్ సిరీస్ రివ్యూ

Published సెప్టెంబర్ 18, 2026 by Srinivas

1990ల్లో ప్రేక్షకులను ‘మర్మదేశం’ అనే సీరియల్‌కు సీక్వెల్‌గా వస్తున్న ‘వీరభద్రుని రహస్యం’ ఫస్ట్ సీజన్ పూర్తైంది. రెండవ సీజన్ ప్రారంభమైంది. ఫస్ట్ సీజన్‌ ఆసక్తికరంగా నడవటంతో సెకండ్ సీజన్‌పై అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలోనే తొలి వారం ఐదు ఎపిసోడ్స్‌ను జీ5 తాజాగా విడుదల చేసింది. మరి సెకండ్ సీజన్ ఎలా ఉంది? తెలుసుకుందాం.

వీరభద్రుని రహస్యం (Part-2)

కథేంటంటే..

ప్రతి ఎపిసోడ్‌ కూడా 1972లో జరిగిన కథతో మొదలవుతుందన్న విషయం తెలిసిందే. నాంచారి (అనురాధ) ఆమె చిన్న కొడుకు గురునాథం కారణంగా పరంధామయ్య కుటుంబం అన్యాయమవుతుంది. ఈ క్రమంలోనే పరంధామయ్య, ఆయన కూతురు ఆత్మహత్య చేసుకుని మరణిస్తారు. వారి మరణాలతో అనురాధ కూతురు పుష్పవల్లి ఆవేదన చెందుతుంది. నాంచారి దాచిన బంగారం గురించి తెలుసుకునేందుకు బ్రహ్మం (కల్కి).. కార్తికేయను కిడ్నాప్ చేస్తాడు. ఆ తరువాత 1990 విషయానికి వస్తే వెన్నెల (అన్ని) తన తండ్రి గురించి తెలుసుకునే క్రమంలో తమ వద్ద ఉన్న సెబాస్టియన్ అనుచరుడిని వదిలేస్తుంది. అతడిని వీరభద్రుడు వచ్చి తల నరికేస్తాడు. అయినా కానీ తండ్రి గురించి కనుక్కునేందుకు వెన్నెల ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటుంది. అలా తన తండ్రి రామాపురంలో ఉన్నాడని తెలుసుకుంటుంది. అక్కడకు వెళితే ఎస్సై రవి ఆమెను ఫాలో అవడంతో సెబాస్టియన్ తప్పించుకుంటాడు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? సెబాస్టియన్ వీరభద్రాపురం వెళ్లాడా? అతను వీరభద్రుడికి బలి ఇవ్వాలనుకున్నదెవరిని? ధర్మ గంట ఎందుకు మోగింది? వంటి విషయాలు తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.

ఎలా ఉందంటే…

సీజన్‌ను దర్శకుడు ఆసక్తికరంగా ప్రారంభించాడు. ఈ వారంలో కొన్ని ఇంట్రస్టింగ్ వివరాలను రివీల్ చేశాడు. అసలు వెన్నెల తండ్రి రామస్వామి, సెబాస్టియన్ వేరు వేరన్న విషయాలను దర్శకుడు రివీల్ చేశాడు. అలాగే మరికొన్ని విషయాలను కూడా రివీల్ చేశారు. అయితే ఈవారం ఎపిసోడ్స్‌లో 1970కి సంబంధించిన కథను పెద్దగా చూపించలేదు. 1990ల నాటి కథతోనే ఎక్కువగా నడిపించారు. వెన్నెలకు బ్రహ్మం సమాచారం ఇవ్వడం వంటి విషయాలను ఈవారం చూపించారు. అలాగే మరో ఇంట్రస్టింగ్ ట్విస్ట్ కూడా రివీల్ చేశారు. ఎంతటి కర్కోటకుడైనా.. ప్రేమానుబంధాలు ఉంటాయన్నట్టుగా చూపించడం ఆసక్తికరం. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకోనుందన్న ఆసక్తిని కూడా క్రియేట్ చేశారు. మొత్తంగా ఈ వారం అయితే ఇంట్రస్టింగ్‌గానే ఉంది.

ఎవరెలా చేశారంటే..

ఈవారం యోగానందం (రఘు కుంచె) పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆయన పాత్ర నిడివి ఈ వారమైతే చాలా తక్కువ. నాంచారి పాత్ర కూడా చాలా తక్కువగానే ఉంది. ఈవారం అన్ని పాత్రే కీలకం. తన పాత్రలో ఆమె చాలా బాగా ఒదిగిపోయారు. కార్తికేయగా రఘు అద్భుతంగా నటించారు. మిగిలిన పాత్రలన్నీ తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు నాగ.. 1990 ‘మర్మదేశం’ మాదిరిగానే దీనిని కూడా ఇంట్రస్టింగ్‌గానే తీసుకెళుతున్నారు. ఈ వారం చాలా సమాధానాలను నాగ రివీల్ చేశారు. మ్యూజిక్ వెబ్‌ సిరీస్‌కు తగినట్టుగా చాలా బాగా ఇచ్చారు. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి. జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌ను కుటుంబం మొత్తం కూర్చొని చూడగలిగేలా ఎపిసోడ్స్ ఉన్నాయి.

ఫైనల్‌గా.. ‘వీరభద్రుని రహస్యం’ ఈ వారం మరింత ఆసక్తికరం.

Rating: (2.75/5)

మరిన్ని వార్తలు

No categories found.