Download App

Save The Tigers 3

OTT Platform: JioCinema/Hotstar

Cast: Priyadarshi, Abhinav Gomatam, Chaitanya Krishna, Vennela Kishore, Sujatha, Rohini, Deviyani Sharma, Seerath Kapoor, Gundu Sudarshan, Avinash

Creator: Mahi V Raghav, Pradeep Advaitham

Director: Sriraam Eragam

Genre: Drama, Comedy, Sitcom, Goofy

Seasons: 3

Episodes: 7

Language: Telugu

Release Date: June 19, 2026

సేవ్ ది టైగర్స్ 3 వెబ్ సిరీస్ రివ్యూ

Published జూన్ 19, 2026 by Srinivas

ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. సినిమాల కంటే ఎక్కువగా ఇవే ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. దీంతో ఒక వెబ్‌సిరీస్ సక్సెస్ అయ్యిందంటే సీజన్ల మీద సీజన్లు తీస్తూనే ఉన్నారు. అలా మూడో సీజన్‌లోకి ‘సేవ్ ది టైగర్స్’ అడుగు పెట్టింది. జియో హాట్ స్టార్‌లో జూన్ 19 నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతోంది. రెండు సీజన్లు ఘన విజయం సాధించడంతో మూడో సీజన్ కోసం ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూశారు. ఆరు ఎపిసోడ్లతో ఇది రూపొందింది. మరి మూడో సీజన్ ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? చూద్దాం.

Save The Tigers Season 3 Web Series Review

కథేంటంటే..

సేవ్‌ ది టైగర్స్ సిరీస్‌ అనేది మధ్య తరగతి కుటుంబాల నడుమ అల్లిన సింపుల్ కథ. మన పక్కింటి వారినో.. ఎదురింట్లోనో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. పైగా ఫన్నీగా ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు దీనికి బాగా కనెక్ట్ అయ్యారు. గంటా రవి (ప్రియదర్శి) పాల వ్యాపారం చేస్తాడు. ఎమ్మెల్యే కావాలనుకుంటే అది కాస్తా బెడిసి కొడుతుంది. భార్య హైమావతి(జోర్దార్‌ సుజాత) కోరిక మేరకు గేటెడ్‌ కమ్యూనిటీకి రవి ప్యామిలీ షిఫ్ట్ అవుతుంది. అక్కడ రవి నానా తంటాలు పడుతుంటాడు. రాహుల్‌(అభినవ్‌ గోమటం) వచ్చేసి రైటర్‌ కావాలనుకుంటాడు, కానీ అవలేక నానా తంటాలు పడతుంటాడు. ఈ క్రమంలోనే భార్య మాధురి(పావణి గంగిరెడ్డి)తో గొడవలు జరుగుతుంటాయి. ఇక విక్రమ్‌(చైతన్య కృష్ణ) వచ్చేసి క్రియేటివ్ యాడ్‌, రైటర్‌. ఆయన భార్య రేఖ(దేవియాని శర్మ) అతనికి విడాకులు ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఇది అసలు కథ. ఇక మూడో సీజన్‌ వచ్చేసి గంటా రవి, విక్రమ్‌, రాహుల్‌ కలిసి ముగ్గురిని కిడ్నాప్‌ చేసి రవి పాత ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ వీరు ముగ్గురు బాగా తాగి సోయి లేకుండా పడిపోగా.. కిడ్నాప్‌కి గురైన ముగ్గురు మత్తులో నుంచి బయటకు వస్తారు. కిడ్నాప్ అయిన ముగ్గురూ.. అచ్చం తమలాగే రవి, రాహుల్, విక్రమ్ ఉండటం చూసి షాక్ అవుతారు. ఆ తరువాత ఈ ముగ్గురికి కూడా సృహ వస్తుంది. వాళ్లు కూడా వీళ్లను చూసి ఆశ్చర్యపోతారు. అసలేం జరిగిందంటే.. విక్రమ్‌, గంటా రవి, రాహుల్‌ ఓ రోజు బార్‌లో బాగా తాగి.. పెళ్లిళ్లు స్వర్గలోకంలో నిర్ణయించబడతాయని పెద్దలు చెబుతారని.. తమకి భార్యల ద్వారా ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన స్వర్గలోకాన్ని, ఇంద్రుడుని తిడతారు. దీన్ని స్వయంగా ఇంద్రుడు(వెన్నెల కిశోర్‌) చూసి… అచ్చంగా వీరిని పోలిన ముగ్గురిని వీరితో స్వాప్ చేస్తాడు. మొత్తంగా రవి, రాహుల్, విక్రమ్‌ల భార్యల వద్దకు మరో లోకంలో ఉన్న ముగ్గురుని ఇంద్రుడు పంపిస్తాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? రవి, రాహుల్, విక్రమ్ ముగ్గురూ తామే అసలైన వాళ్లమని నిరూపించుకున్నారా? అనేది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

Save The Tigers Season 3 Web Series Review

ఎలా ఉందంటే..

రవి, రాహుల్, విక్రమ్ ముగ్గురిని కిడ్నాప్‌ చేయడంతో ఫస్ట్ ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. తొలి సన్నివేశం నుంచే ఫన్ ప్రారంభమవుతుంది కానీ అంతగా ఆకట్టుకోదు. తర్వాత వచ్చే ఎపిసోడ్స్‌లో మాత్రం బాగానే వర్కవుట్ అయ్యింది. ఇక అంతలోనే కిడ్నాప్ చేసిన ముగ్గురూ అచ్చంగా వారిని పోలినట్టే ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏమాత్రం ఊహించి ట్విస్ట్ అది. ఆ తర్వాత ఇంద్రలోకం సీన్లు సైతం చాలా కామెడీగా ఉంటాయి. యముడు వెన్నెల కిషోర్ కావడంతో ఫన్‌కు లోటేం ఉంటుంది. కథానాయకులైన ముగ్గురిని స్వాప్‌ చేయడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆద్యంతం అన్ని సన్నివేశాలు చాలా హిలేరియస్‌గా దర్శకుడు రూపొందించాడు. మూడు ఎపిసోడ్ల వరకూ కొంచెం ఆ ముగ్గురూ ఎవరన్న కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. నాలుగో సీజన్ నుంచి కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోయి మరింత ఫన్నీగా కథ నడుస్తుంది. తమ భర్తలుగా కొత్తగా వచ్చిన వారిని చూసి భార్యల రియాక్షన్‌, వారికి వీరిచ్చే రియాక్షన్‌ వింతగా ఉండటంతో అది ఆడియెన్స్ ని నవ్విస్తుంది. ఇందులో మరో హైలైట్ కూడా ఉంది. ముఖ్యంగా ఐదో ఎపిసోడ్‌ నుంచి కాస్త ఆలోచింపజేసేలా.. ఎమోషనల్‌గా ఉంటుంది. ప్రారంభం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఎండింగ్‌ను తీర్చిదిద్దిన తీరు బాగుంది. ఇక ఈ సిరీస్‌కు ఫుల్‌స్టాప్ పెట్టినట్టుగా అనిపించింది. తొలి రెండు సీజన్లతో పోలిస్తే.. దీనిలో ట్విస్ట్‌లతో పాటు ఫన్ పాళ్లు కూడా కాస్త ఎక్కువే.

ఎవరెలా చేశారంటే..

ప్రియదర్శి గురించి చెప్పేదేముంది? గంటా రవిగా తెలంగాణ యాసలో అదరగొట్టేశాడు. ఫన్ విషయంలోనూ ఏమాత్రం తగ్గకుండా ఇచ్చేశాడు. డ్యుయల్ రోల్ కాబట్టి డిఫరెన్స్ కూడా స్పష్టంగా చూపించాడు. చైతన్య కృష్ణ..ఓ వైపు రొమాంటిక్‌గా, మరోవైపు ఇన్నోసెంట్‌గా రెండు వేరియేషన్స్‌ని అద్భుతంగా చూపించాడు. అభినవ్‌ గోమటం కూడా ఏమాత్రం తగ్గకుండ నటించాడు. ముఖ్యంగా కామెడీ అయితే వేరే లెవల్. సుజాత, పావణి గంగిరెడ్డి, దేవియాని శర్మ.. ఇలా ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. ఇన్నోసెంట్‌గా, డేర్‌ ఉన్న లాయర్‌గా విభిన్న షేడ్స్ ని చూపించి అదరగొట్టింది. వెన్నెల కిశోర్‌ అదరగొట్టారు. గుండు సుదర్శన, అభయ్‌, గంగవ్వ తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.

Save The Tigers Season 3 Web Series Review

టెక్నికల్ పరంగా..

విజువల్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త వహించాల్సింది. తొలి ఎపిసోడ్స్‌ను కూడా దర్శకుడు మరింత ఫన్నీగా రాసుకుని ఉంటే బాగుండేది. కానీ ట్విస్ట్‌లు, ఆ తరువాత వచ్చే ఫన్‌, ఎమోషన్స్‌తో వెబ్‌సిరీస్‌ను చక్కగా నడిపించారు నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి. మ్యూజిక్‌ విషయానికి వస్తే… మెయిన్ ఆర్ఆర్ ఆర్‌ఆర్‌ వెబ్‌సిరీస్‌కి చక్కగా సెట్ అయ్యింది.

ఫైనల్‌గా.. ‘సేవ్ ది టైగర్స్’ ఫన్ లోడెడ్ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

Rating: (2.75/5)

మరిన్ని వార్తలు

No categories found.